కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్ జరుగుతోంది.. ఈ ఏడాదే 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.. మరోవైపు.. మరోవైపు 18 ఏళ్లకు దిగునవారికి వ్యాక్సినేషన్‌పై ట్రయల్స్ కొనసాగుతున్నాయి.. చిన్నారులకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఇక, వ్యాక్సిన్ తీసుకున్నవారిలో యాంటీబాడీలు ఎన్ని రోజులు ఉంటాయనేదనిపై రకరకాల పరిశోధనలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి.. కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఓ స్టడీ తేల్చింది.
భారత్‌లో వ్యాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలపై ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న రీజినల్ మెడికల్ రీసర్చ్ సెంటర్ అధ్యయనం నిర్వహించింది.. దానికి సంబంధించిన డేటాను రిలీజ్ చేశారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న మొత్తం 614 హెల్త్ వర్కర్లపై ఈ స్టడీ నిర్వహించారు.. అయితే, కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్న నాలుగు నెలల తర్వాత ఆ వ్యక్తిలో యాంటీబాడీలు గణనీయంగా తగ్గుతున్నట్లు ఓ స్టడీ తేల్చింది. కానీ, యాంటీబాడీలు తగ్గుతున్నంత మాత్రాన.. వారిలో వ్యాధి నిరోధక సామర్థ్యం పూర్తిగా నిర్వీర్యం అయిపోయినట్టు చెప్పలేమని పేర్కొంది ఆ అధ్యయనం.. ఆరు నెలల తర్వాత మాత్రమే బూస్టర్ డోసు ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పగలమని ఆర్ఎంఆర్సీ డాక్టర్ సంగమిత్ర పతి వెల్లడించారు.. భారత్‌లో జరుగుతోన్న వివిధ అధ్యయనాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‌లో జరిగిన అధ్యయనానికి సంబంధించిన నివేదికను రీసర్చ్ స్క్వేర్‌లో పబ్లిష్ చేశారు. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తీసుకున్నవారిపై ఈ అధ్యయనం చేసినట్టు చెబుతున్నారు.