న్యూజిలాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత జట్టు చివరి వరకు కష్టపడినా అది డ్రా గా ముగిసింది. కివీస్ జట్టు ఆఖరి బ్యాటర్లు వికెట్ కోల్పోకుండా అడ్డుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో 4వ రోజు టీం ఇండియా డిక్లర్ చేసిన సమయం కంటే కొంచెం ముందు డిక్లర్ చేస్తే ఫలితం మరోలా ఉండేది అని చాలా వార్తలు వచ్చాయి. అయితే దీని పై స్పందించిన భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ… నేను అలా భావించడం లేదు అని చెప్పాడు. అలాగే మా డిక్లర్ కంటే అరగంట ముందు వరకు కూడా మేము చాలా ఒత్తిడిలో ఉన్నం అని చెప్పాడు. మేము డిక్లరేషన్ ను చాలా చక్కగా ముగించామని నేను అనుకున్నాను. మాకు కీలకమైన ఆ భాగస్వామ్యం చివర్లో వృద్ధిమాన్ సాహా, అక్షర్ పటేల్ నెలకొల్పారు. అయితే వీరిద్దరూ కలిసి భారత్ డిక్లేర్ చేయడానికి ముందు 67 పరుగులు జోడించారు. అది మాకు కీలకమైన భాగస్వామ్యం అని ద్రావిడ్ అన్నారు.