ఇండియా పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఖండ భారత్ 1947లో ఇండియా పాక్ దేశాలుగా విడిపోయింది. ఇండియాను హిందూస్తాన్ అని పిలిస్తే ముస్లీంలు ఉన్న దేశాన్ని పాకిస్తాన్ అని పిలుస్తున్నారు. అయితే, ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వచ్చింది. ఎవరు నిర్ణయించారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహ్మద్ ఆలీ జిన్నా, కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తరువాత ముస్లీంలకు కొత్త దేశం కావాలనే వాదనను తెరమీదకు తీసుకొచ్చారు. కొత్త దేశం కావాలనే వాదన తెరమీదలకు వచ్చినా, దానికి ఏ పేరు పెట్టాలన్నది ఆలోచించలేదు.
Read: Dry Day: డ్రైడే అనే పదాన్ని దేశంలో మొదట ఎప్పుడు వాడారో తెలుసా?
1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో ముస్లీంలకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌ను తీసుకొచ్చారు. 1933లో లండన్‌లో చదువుతున్న ముస్లీం జాతీయవాద విద్యార్థి రహమత్ ఆలీ ముస్లీంలకు ప్రత్యేక దేశం కావాలనే డిమాండ్‌తో తన స్నేహితులతో కలిసి బ్లూప్రింట్‌ను తయారు చేశారు. దానికి పాకిస్తాన్ అనే పేరును పెట్టారు. పాక్ అంటే స్వచ్చత అని స్తాన్ అంటే భూమి అని అర్థం. పాకిస్తాన్ అంటే స్వచ్చమైన భూమి అని అర్ధం. ఈ పదాన్ని 1933 జనవరి 28 వ తేదీన రహమత్ ఆలీ ప్రపంచానికి పరిచయం చేశారు.