ఇండియా చైనా సరిహద్దుల్లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య పొడవైన సరిహద్దు ఉన్నది. రెండు దేశాల మధ్య ఖచ్చితమైన సరిహద్దులు లేకపోవడంతో రగడ జరుగుతున్నది. చైనా బోర్డర్‌కు కూతవేటు దూరంలో ఓ టీ దుకాణం ఉన్నది. చందర్ సింగ్ బద్వాల్ అనే వ్యక్తి గత 25 ఏళ్లుగా ఈ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఉత్తరాఖండ్‌లోని ఇండియా చైనా బోర్డర్లో ఉన్న చివరి దుకాణం కావడంతో దీనిని హిందుస్తాన్‌కి అంతిమ్…
సర్జికల్ స్ట్రయిక్స్‌కు సాక్ష్యమేదీ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు.. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారు కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ… డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. అయినప్పటికీ మీరు సాయుధ బలగాల…
కేంద్రప్రభుత్వం దిగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నది. ముడిపామాయిల్ దిగుమతిపై సుంకాన్ని 7.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్‌ను తగ్గిస్తూ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అంతేకాదు, ఎడిబిల్ ఆయిల్‌పై బేసిక్ కస్టమ్ డ్యూటీ తగ్గింపును ఈ ఏడాది సెప్టెంబర్ 30 వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న గడువు మార్చి 31 వ తేదీతో ముగుస్తుండగా, దీనిని సెప్టెంబర్ 30…
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరిగింది. టాటా నిక్సాన్, ఎంజీ మోటార్స్‌తో పాటు మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. భారత్‌లో అతిపెద్ద కార్ల కంపెనీల్లో ఒకటైన మారుతి-సుజుకీ సంస్థ ఎలక్ట్రిక్ కారును తయారు చేసింది. ఈ కారును విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నది. దానికి తగ్గట్టుగానే మారుతీ సంస్థ కారును డిజైన్ చేసింది. టయోటాతో కలిసి మారుతీ సుజుకీ సంస్థ ఈ కారును…
భారత్ కరోనా కేసులు భారీ సంఖ్యలో తగ్గుతూ వస్తున్నాయి.. 50వేల దిగువకు పడిపోయాయి రోజువారి కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి, మరో 684 మంది కోవిడ్ బాధితులు కన్నుమూశారు… ఇక, యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 6 లక్షల దిగువకు పడిపోయి 5,37,045కు చేరింది.. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతం నుంచి 3.17 శాతానికి పడిపోయినట్టు…
భారత్‌లో బంగారం ధర మళ్లీ పైపైకి ఎగబాకుతోంది.. రూ.51 వేల మార్క్‌ను మళ్లీ క్రాస్ చేసి దూసుకుపోతోంది 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. నవంబర్ 19 తర్వాత ఇదే గరిష్ఠస్థాయి కాగా.. భవిష్యత్‌లో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు మార్కెట్ విశ్లేషకులు.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా పెరుగుతోంది.. ఇవాళ రూ.100 పెరగడంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050కి చేరింది.. 22…
ఇండియా పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఖండ భారత్ 1947లో ఇండియా పాక్ దేశాలుగా విడిపోయింది. ఇండియాను హిందూస్తాన్ అని పిలిస్తే ముస్లీంలు ఉన్న దేశాన్ని పాకిస్తాన్ అని పిలుస్తున్నారు. అయితే, ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వచ్చింది. ఎవరు నిర్ణయించారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహ్మద్ ఆలీ జిన్నా, కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. బయటకు…
చిన్న వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. తగ్గిపోయిందనుకుంటే మళ్ళీ మరో వేరియంట్ రూపంలో ముంచుకొచ్చి ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా మహమ్మారి రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. అయితే, త్వరలోనే దీని పీడ విరగడ అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. కానీ… వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాత్రం కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనంటోంది. ఇంతకీ కరోనా ముప్పు ముగిసినట్టా? కాదా? మున్ముందు రాబోయే వేరియంట్ల గురించి WHO చెబుతున్నదేమిటి? రోజులు… వారాలు… నెలలు… దాటి ఏకంగా రెండేళ్లను మింగేసింది కరోనా…
డ్రై అంటే ఎండిపోడం, డే అంటే రోజు. డ్రైడే అంటే ఎండిపోయిన రోజు అని అర్థం. డ్రైడే అనే పదాన్ని దేనికోసం వాడతారు అంటే, లిక్కర్ హాలిడే కోసం డ్రైడే అనే పదాన్ని వినియోగిస్తారు. సాధారణంగా దేశంలో లిక్కర్ షాపులను బంద్ చేసిన రోజును డ్రైడే అని పిలుస్తారు. దేశంలో అన్ని ప్రాంతాల్లో డ్రైడే ఒకేవిధంగా ఉండదు. జనవరి 26, ఆగస్ట్ 15, అక్టోబర్ 2 తేదీల్లో దేశవ్యాప్తంగా లిక్కర్ హాలిడే కాబట్టి ఆరోజుల్లో డ్రైడే నడుస్తుంది.…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. కొత్త కొత్త వాహానాలు అందుబాటులోకి రావడంతో ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, భారత్‌కు చెందిన వార్డ్ విజార్డ్ సంస్థ రెండు ఎలక్ట్రిక్ వాహనాలను విపణిలోకి విడుదల చేసింది. వొల్ఫ్ +, నాను + అనే రెండు వాహనాలను విపణిలోకి ప్రవేశపెట్టింది. యువతను లక్ష్యంగా చేసుకొని ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వోల్ప్…