దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగాయి. ప్రజల్లో కరోనావైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రుసగా రెండోరోజూ కొత్త కేసులు ఏడు వేల మార్కు దాటాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 7,584 మంది వైరస్ బారిన పడ్డారు. 24 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు విడిచారు. గురువారం 3,791 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల…
నాలుగురోజుల వరుస నష్టాలకు ఈరోజు తెరపడింది. భారత స్టాక్‌మార్కెట్లు గురువారం నాడు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 55,320 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 16,478 వద్ద ముగిసింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ విధానం ప్రభావం ఎక్కువేమీ స్టాక్ మార్కెట్లపై పడలేదు. మధ్యాహ్నం వరకు రేంజ్ బౌండ్లో కదలాడిన సూచీలు సాయంత్రానికి సర్రున పైకి ఎగిశాయి. దీంతో లాభాలను చవిచూశాయి. ఉదయం 10 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్…
భారత రాష్ట్రపతి పదవి అనేది ఎంతో కీలకం. దేశం మొత్తం పరిపాలన అంతా రాష్ట్రపతి పేరుమీదే కొనసాగుతుంది. భారత రాజ్యాంగంలో రాష్ట్రపతికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చింది. నిజానికి భారత ప్రభుత్వానికి అధిపతి రాష్ట్రపతే అయినా.. వాస్తవంగా అధికారం చెలాయించేది ప్రధాని సారథ్యంలోని మంత్రి మండలి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం రాష్ట్రపతికి విశేష అధికారాలను కల్పించింది భారత రాజ్యాంగం. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో భారత రాష్ట్రపతికి విశేష అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కూడా సాధారణం…
భారత్‌లో కరోనా మరోసారి విజృంభిస్తోంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 7,240 మంది వైరస్ బారినపడ్డట్లు తేలింది. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,723కి చేరింది. బుధవారం 3,591 మంది కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద…
కొన్ని సినిమాలు నిజ జీవితాలను చూసి ప్రేరణ పొందుతాయి అని అంటూ ఉంటారు. ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఒక ఘటన కూడా సినిమానే తలపిస్తుంది. విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన డియర్ కామ్రేడ్ సినిమా గుర్తు ఉండే ఉంటుంది.. మహిళా క్రికెటర్ అవ్వాలనుకున్న రష్మికను ఆమె కోచ్ లైంగికంగా వేధించి బయటికి పంపించేస్తాడు.. ఆ దారుణమైన ఘటనతో ఆమె మానసికంగ కృంగిపోయి ఆటకు దూరమవుతుంది.. చివరకు హీరో సహాయంతో అతడి గురించిన నిజాన్ని బయటపెట్టి మళ్లీ…
భారత్‌లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో ఏకధాటిగా 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణాన్ని నాలుగు రోజుల్లోనే పూర్తి చేసింది. దీంతో ఖతార్‌పేరుతో ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ మేరకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గిన్నిస్ రికార్డ్ సర్టిఫికెట్‌ను, రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్లో షేర్ చేశారు. ఇంతటి గొప్ప పనిలో రాత్రి, పగలు భాగమైన ఇంజనీర్లు,…
టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. 23 ఏళ్ల పాటు క్రికెట్‌ను ఆస్వాదించానని, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నానని మిథాలీరాజ్ వివరించింది. దీనికి అందరి ఆశీర్వాదాలు కావాలని ఆకాంక్షించింది. అనేక మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించిన తాను భవిష్యత్తులో మహిళా క్రికెట్ వృద్ధికి తోడ్పాటును అందిస్తానని మిథాలీరాజ్ పేర్కొంది. హైదరాబాద్‌కు చెందిన మిథాలీరాజ్ ప్రపంచ మహిళా క్రికెట్లో వన్డేల్లో ఎక్కువ పరుగులు సాధించిన ఘనతను సొంతం…
దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో ధరల తగ్గింపునకు సంబంధించి అన్ని అవకాశాలను కేంద్రం వినియోగించుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులను రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది. రానున్న ఆరు నెలల పాటు ముడి చమురు సరఫరా కోసం ఒప్పందం చేసుకునేందుకు దేశీయ చమురు సంస్థలు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.…
భారత వృద్ధి రేటు అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రపంచ బ్యాంకు మరోమారు తగ్గించింది. 8.7 శాతం వృద్ధిరేటు లభిస్తుందని ఈ ఏడాది జనవరిలో అంచనా వేసిన ప్రపంచబ్యాంక్, దానిని 8 శాతానికి సవరిస్తున్నట్లు ఏప్రిల్‌లో పేర్కొంది. వృద్ధిరేటు అంచనాలను 7.5 శాతానికి పరిమితం చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంటే జనవరి నాటి తొలి అంచనాలతో పోలిస్తే వృద్ధిరేటు అంచనాలను 1.2 శాతం మేర ప్రపంచ బ్యాంక్ తగ్గించినట్లయ్యింది. 2023-24లో వృద్ధిరేటు మరింత నెమ్మదించి 7.1…
శ్రీలంక పరిస్థితి ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ఆ దేశం అప్పుల్లో కూరుకుపోయింది. నిత్యావసరాల కోసం కొనేందుకు జనాల దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దేశ ఖజానా మొత్తం పూర్తిగా దివాళా తీసింది. ప్రస్తుతం శ్రీలంక విదేశాల ఇచ్చే సాయంపైనే ఆధారపడింది. ప్రజల ఆగ్రహావేశాల మధ్య గతంలో ప్రధానిగా ఉన్న మహిందా రాజపక్సే రాజీనామా చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన రణిల్ విక్రమసింఘే శ్రీలంకలో ఆహార సంక్షోభాన్ని హెచ్చరిస్తూ కీలక…