Iran: భారత్‌ను అమెరికా వేడుకుంటోంది.. ఇరాన్ మంత్రి కీలక వ్యాఖ్యలు..
- భారత్‌ను అమెరికా బ్రతిమిలాడుతోంది..
- రష్యన్ ఆయిల్ కొనుగోలుపై ఇరాన్ మంత్రి వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభాన్ని సృష్టించింది. అమెరికా అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకప్పుడు రష్యా నుంచి చమురు కొనొద్దని భారత్‌పై ఒత్తిడి తెచ్చిన అమెరికా, ఇప్పుడు భారత్‌తో పాటు వివిధ దేశాలు రష్యన్ ఆయిల్ కొనాలని బ్రతిమిలాడుతోందని ఆయన విమర్శించారు.
Read Also: Iran War: అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల్ని స్థిరీకరించడానికి ఇప్పుడు అమెరికా, భారత్ వంటి దేశాలను రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కోరుతోంది. రష్యన్ చమురుపై అమెరికా ఆంక్షలు ఎత్తేసింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ధరల్ని స్థిరీకరించడానికి రష్యా క్రూడ్ ఆయిల్ కొనడానికి అమెరికా అనుమతులు ఇచ్చిందని అరాగ్చీ విమర్శించారు.
సముద్రంలో నిలిచిపోయిన రష్య చమురు నౌకలను కొనుగోలు చేసేందుకు భారత్‌తో సహా ప్రపంచ దేశాలకు అమెరికా 30 రోజుల పాటు తాత్కాలిక మినహాయింపు ఇచ్చిందనే వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 11 వరకు ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే, ఈ వార్తల్ని భారత్ ఖండించింది. రష్యా ఆయిల్ కొనుగోలుకు తమకు ఎవరి అనుమతి అవసరం లేదని, ధరలు ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడి నుంచి కొనుగోలు చేస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే, రష్యాకు వ్యతిరేకంగా అమెరికా మద్దతు లభిస్తుందనే ఆశతో యూరప్ కూడా ఇరాన్‌పై జరుగుతున్న ‘‘అక్రమ యుద్ధానికి’’ మద్దతు ఇస్తోందని అరాగ్చీ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..