కరోనా మహమ్మారి దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. గత రెండేళ్ల నుంచి గ్లోబల్ సప్లై చైన్ వ్యవస్థ దెబ్బతింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక, సేవా, వ్యవసాయ రంగాలపై ప్రభావం పడింది. ఇప్పటికీ శ్రీలంక వంటి దేశాలు కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతింది. కరోనా కారణంగా ఎక్కడిక్కడ దేశాలు ఆంక్షలు, లాక్ డౌన్లు విధించుకున్నాయి. దీంతో ఇతర దేశాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. ఫ్లైట్స్, రైళ్లు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రెండేళ్ల క్రితం కోవిడ్…
ఇండియాలో కరోనా తీవ్రత కనిపిస్తోంది. ఓ వైపు కొత్తగా బీఏ4, బీఏ5 వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు తాజాగా మహారాష్ట్రలో ఈ వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ రోజూవారీ కరోనా కేసులను వెల్లడించింది. కేసుల సంఖ్య 3 వేల కన్నా తక్కువగానే ఉన్నా.. గత నాలుగైదు రోజుల నుంచి నెమ్మదిగా కేసులు పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన…
నేపాల్ మరోసారి తన బుద్ధిని బయటపెట్టింది. మనం మిత్రదేశంగా భావిస్తున్నప్పటికీ.. భారత భూభాగాలపై ఎప్పటికప్పుడు పేచీ పెడుతూనే ఉంది. గతంలో ప్రధానిగా ఉన్న కేపీ శర్మ ఓలీ చైనాకు మద్దతుగా ఉండీ.. భారత్ భూభాగాలైన లిపులేక్, లింఫియాధురా, కాలాపానీ ప్రాంతాలను తమ దేశానికి చెందినవిగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా మరోసారి నేపాల్ ఈ మూడు ప్రాంతాలపై పార్లమెంట్ లో చర్చించింది. ఈ మూడు ప్రాంతాలపై నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా కీలక ప్రకటన చేశారు. ఈ…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు సేవ్ సాయిల్ ఉద్యమం సమిష్టిగా జరిపిన సంగీత కచేరీ – మట్టి కోసం మనం ముఖ్య అతిథితో పాటు పలువురు సేవ్ సాయిల్ వాలంటీర్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడంతో ఈ కార్యక్రమం మొదలైంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు మట్టిని రక్షించు ఉద్యమం నిర్వాహకులు ఈరోజు హైదరాబాద్‌లో లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ – మట్టి కోసం మనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మట్టిని…
కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్ కు యూఏపీఏ చట్టం కింది ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశానికి వ్యతిరేఖంగా వ్యవహరించడం వంటి కేసులపై ఇటీవల ఎన్ఐఏ కోర్ట్ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇదిలా ఉంటే కొన్ని దేశాలు, కొన్ని సంస్థలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ లోని అక్కడి ప్రభుత్వం, మీడియా, ప్రముఖులు యాసిన్ మాలిక్ శిక్షపై వ్యతిరేఖంగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత్ ఎప్పుడూ కాశ్మీర్ పై నిర్ణయాలు తీసుకున్నా ఆర్గనైజేషన్…
ప్రభుత్వాాలు మారిన పాకిస్తాన్ భారత్ పై విషం చిమ్మడం మానదు. తన దేశాన్ని వెలగబెట్టలేదు కానీ అవకాశం వచ్చినప్పుడు కాశ్మీర్ ను రాజకీయం చేయాలని భావిస్తూనే ఉంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలతో సతమతం అవుతున్న పాకిస్తాన్, భారత్ కు నీతులు చెప్పడం విడ్డూరం. తన దేశంలో మైనారిటీలపై అఘాయిత్యాలు, హింస గురించి మాట్లాడదు కానీ కాశ్మీరి ప్రజల హక్కులను గురించి ప్రశ్నిస్తూ ఉంటుంది. తాజాగా కొత్తగా ఎన్నికైన ప్రధాని షహబాజ్ షరీఫ్ మళ్లీ పాత…
దేశంలో గత కొన్ని రోజుల నుంచి క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 2710 కేసులు నమోదు అయ్యాయి. ఇది గురువారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. నిన్న ఒక్క రోజే మహమ్మారి బారిన పడి 14 మంది మరణించారు. ఇదిలా ఉంటే 24 గంటల్లో 2296 మంది కరోనాను జయించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో మొత్తం 15,814 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. కరోనా ప్రారంభం అయినప్పటి…
ఆసియా కప్ హాకీలో గురువారం ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ చెలరేగింది. 16-0 గోల్స్ తేడాతో ఇండోనేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇండియా ఫస్ట్ ఆఫ్‌లో 6-0తో ముందంజలో నిలవగా.. సెకండ్ ఆఫ్‌లో భారత ఆటగాళ్ల మరింత రెచ్చిపోయారు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి 16 గోల్స్ కొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతం చేసిందనే చెప్పాలి. సూపర్-4 దశకు చేరుకోవడానికి భారత్ 15 గోల్స్ తేడాతో…
దేశంలో చమురుధరలు ఆకాశాన్నంటాయి. ఈమధ్య కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంచెం దిగివచ్చాయి. కొన్ని రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించుకోవడంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగిపోవడంతో ద్రవ్యోల్బణం కూడా బాగా పెరిగింది. ఆల్ టైం హైకి చేరింది. గోధుమల ధరల్ని నియంత్రించేందుకు కేంద్రం ఎగుమతుల్ని నిషేధించింది. అదే బాటలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దేశంలో ధరలు పెరిగిపోతున్న…
నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు దడ పుట్టిస్తున్నారు. అన్న వస్త్రాల కోసం ఉన్న వస్త్రాలు పోయాయయనేది సామెత. ఈ విషయంలో అది నిజమయింది. దుబాయ్ దినార్స్ పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. దుబాయ్ కరెన్సీ లక్ష ఇస్తే..ఇండియా కరెన్సీ ఇవ్వండంటూ నమ్మించి నట్టేట మంచుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో కొందరు కేటు గాళ్లు నయాదందాకు తెరలేపారు. బోధన్, బాన్సువాడ కేంద్రంగా.. ఈ ముఠా అమాయకులను కరెన్సీ పేరిట మోసాలకు గురిచేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో కరెన్సీ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. బోధన్,…