అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…
శాశ్వత మిత్రులు... శాశ్వత శత్రువులు ఉండరని.. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం సుంకాల వివాదం నడుస్తోంది.
ప్రధాని మోడీ జపాన్ చేరుకున్నారు. టోక్యో చేరుకోగానే ఎయిర్‌పోర్టులో మోడీకి ఘనస్వాగతం లభించింది. జపాన్, చైనా పర్యటన కోసం మోడీ గురువారం బయల్దేరి వెళ్లారు. శుక్ర, శనివారం పర్యటనలో భాగంగా 15వ భారత్-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు.
* నేడు జపాన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన.. సెమీ కండక్టర్లతో ప్రత్యేక సమావేశంలో పాల్గొననున్న మోడీ * నేడు ఉదయం 8.30 గంటల వరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, కొత్తగూడెం జిల్లాల్లో…
భారత దేశ ఫిజ్జా మార్కెట్లో మరింత పోటీ పెరగనుంది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద పిజ్జా డెలివరీ కంపెనీ అయిన పాపా జాన్స్ ఇండియాలోకి తిరిగి రాబోతుంది. 8ఏళ్ల తర్వాత అమెరికాకు చెందిన ఈ కంపెనీ ఇండియాలో స్టోర్ ను ఏర్పాటు చేయనుంది. అక్టోబర్ 2025లో బెంగుళూరులో మొదటి స్టోర్ ఏర్పాటు చేయడంతో పాట.. రాబోయో పదేళ్లలో దేశం మొత్తంలో 650 స్టోర్లను స్థాపించాలని చూస్తుంది. ప్రస్తుతం 2,200 కంటే పైగా స్టోర్లతో డొమినోస్ పిజ్జా ఆధిపత్యం చెలాయిస్తుండగా,…