* రష్యాలో మరోసారి భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.8గా నమోదు.. సునామీ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
* ఆసియా కప్: నేడు ఇండియాతో ఒమన్ ఢీ.. అబుదాబి వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్
* ఏపీ: వచ్చే 4 రోజులు దక్షిణ కోస్తా, రాయలసీ లో ఓ మోస్తరు వర్షాలు.. నేడు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు.. నేడు, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
* అమరావతి: ఇవాళ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. క్వశ్చన్ అవర్ తో సమావేశాలు ప్రారంభం.. పేదలకు ఇళ్ల పట్టాలు… ఆరోగ్యశ్రీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్, రాజోలు నియోజక వర్గంలో కొబ్బరి ప్రాసెసింగ్ యూనిట్.. డిజిటల్ కార్పొరేషన్ నిధులు మళ్లింపు, క్రీడా శిక్షకుల కొరత, ప్లాస్టిక్ కాలుష్యం తదితర అంశాలపై సభ్యుల ప్రశ్నలు
* అమరావతి: నేడు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర్ణయాలు సభ ముందు ఉంచనున్న సీఎం చంద్రబాబు.. పంచాయితీ రాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ప్రవేశ పెట్టనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సభలో 8 బిల్లులు ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.
* అమరావతి: ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ.. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులకు ఆమోదం తెలపనున్న కేబినెట్.. 15 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సమావేశం
* ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. పబ్లిక్ అఫైర్స్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం.. విజన్ తెలంగాణ, తెలంగాణ రైజింగ్‌ప నేడు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం
* నేడు ఛత్తీస్‌గఢ్‌కు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిని కలవలనున్న ఉత్తమ్.. సమ్మక్క – సారలమ్మ ప్రాజెక్టు ముంపుపై చర్చించనున్న మంత్రులు
* అమరావతి: ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభంకానున్న రెండవ రోజు శాసనమండలి సమావేశాలు…
* అమరావతి : రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమం.. రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన వైసీపీ..
* అమరావతి : ఇవాళ తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 11.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.. మధ్యాహ్నం 12.15 గంటలకు విమానంలో బయలుదేరి 2 గంటలకు బెంగుళూరు చేరుకుంటారు..
* ప్రకాశం : మార్కాపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ భారీగా నిరసన కార్యక్రమం చేపట్టనున్న వైసీపీ. పాల్గొననున్న జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే లు, ఇంఛార్జ్‌లు, వైసీపీ నాయకులు.. 30 యాక్ట్ అమలులో ఉందని ఎటువంటి ర్యాలీలు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్తున్న పోలీసులు..
* తూర్పుగోదావరి జిల్లా: నేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీ ఆందోళన.. రాజమండ్రి క్వారీ సెంటర్ నుండి మెడికల్ కాలేజీ వరకు కొనసాగనున్న నిరసన ర్యాలీ..
* తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి.. శిలాతోరణం వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,095 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 23,932 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.7 కోట్లు
* శ్రీ సత్యసాయి : నేడు పెనుగొండలో వైసీపీ యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం. హాజరుకానున్న యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు.
* కడప సెంట్రల్ జైల్‌లో వైఎస్ వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరిని బెదిరించిన కేసులో మరోమారు విచారణ.. నేడు మరోమారు విచారించే అవకాశం…
* కడప : పులివెందులలో నేడు చలో మెడికల్ కాలేజీ.. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడంపై వైయస్సార్సీపి యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చలో మెడికల్ కాలేజీ నిరసన .
* పల్నాడు జిల్లా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నేడు ఛలో పిడుగురాళ్ల.
* కర్నూలు: నేడు ఆదోని మెడికల్ కాలేజీని సందర్శించనున్న వైసీపీ నేతల బృందం.. ప్రైవేటీకరణ విధానం ఆపాలంటూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యం లో కాలేజీని సందర్శించనున్న వైసీపీ నాయకులు
* నిజమాబాద్ : నేడు జిల్లాలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పర్యటన.. ట్రాస్మా ఆధ్వర్యంలో జరిగే గురు పూజోత్సవం లో పాల్గొననున్న మహేష్ గౌడ్.
* తూర్పుగోదావరి జిల్లా: ఛలో మెడికల్ కాలేజీల ఆందోళన సందర్భఁగా రాజమండ్రిలో పదిమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేసిన పోలీసులు .. సెక్షన్ 30 అమలులో ఉన్న కారణంగా ఎవరు ఎటువంటి ఆందోళనలు ర్యాలీలు నిర్వహించవద్దని హెచ్చరిక