PM Modi: నేపాల్ ప్రధాని సుశీల కర్కితో మాట్లాడిన మోడీ.. ఏం చర్చించారంటే..!
- నేపాల్ ప్రధాని సుశీల కర్కితో మాట్లాడిన మోడీ
- వివరాలు ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రధాని మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్ ప్రధాని సుశీలా కర్కితో ప్రధాని మోడీ తొలిసారి సంభాషించారు. ఇటీవల నేపాల్‌లో సంభవించిన సంక్షోభం కారణంగా కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ సుశీలా కర్కిని తాత్కాలిక ప్రధానిగా ఎన్నకున్నారు.
గురువారం సుశీలా కర్కితో ప్రధాని మోడీ ఫోన్‌లో సంభాషించారు. ఇటీవల జరిగిన విషాదకరమైన ప్రాణనష్టంపై మోడీ సంతాపం వ్యక్తం చేశారు. శాంతి, స్థిరత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధాని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. నేపాల్ ప్రధాని సుశీలతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిగినట్లుగా తెలిపారు. అలాగే శుక్రవారం నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా సుశీలకు, నేపాల్ ప్రజలకు మోడీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినట్లు మోడీ రాసుకొచ్చారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: Rajasthan: ప్రియుడి కోసం ఓ ఇల్లాలు దుశ్చర్య.. అడ్డుగా ఉందని 3 ఏళ్ల చిన్నారిని చంపేసిన తల్లి
ఇక నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల మాట్లాడుతూ.. 6 నెలలు కంటే ఎక్కువ కాలం అధికారం అంటిపెట్టుకుని ఉండటానికి రాలేదని చెప్పారు. 6 నెలల్లో కొత్త పార్లమెంట్‌కు బాధ్యతలు అప్పగిస్తామని బాధ్యతలు స్వీకరించిన సమయంలో సుశీల చెప్పుకొచ్చారు. నేపాల్‌లో 2026, మార్చి 5న కొత్త ఎన్నికలు జరగనున్నాయి.
ఇది కూడా చదవండి: Tamil Nadu: దక్షిణాదికొస్తే కంగనా రనౌత్‌ను చెప్పుతో కొట్టిండి.. దుమారం రేపుతోన్న కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు
కేపీ శర్మ ఓలి ప్రభుత్వ.. నేపాల్‌లో సోషల్ మీడియాపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది యువతలో ఆగ్రహాన్ని రగిలించింది. జెన్-జెడ్ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఖాట్మండులో భారీగా నిరసనకారులు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల ఇళ్లపై ఆందోళనకారులు దాడి చేశారు. ఈ ఘర్షణల్లో 19 మంది నిరసనకారులు చనిపోయారు. ఒక మాజీ ప్రధాని భార్య సజీవదహనం అయింది. అనంతరం కేపీ శర్మ ఓలి ప్రభుత్వం కూలిపోయింది. అటు తర్వాత సుశీలా కర్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం నేపాల్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి.
Had a warm conversation with Mrs. Sushila Karki, Prime Minister of the Interim Government of Nepal. Conveyed heartfelt condolences on the recent tragic loss of lives and reaffirmed India’s steadfast support for her efforts to restore peace and stability. Also, I extended warm…
— Narendra Modi (@narendramodi) September 18, 2025
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!