దేశవ్యాప్తంగా ఎండలు పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.వేసవి తాపానికి తాళలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. అయితే, రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 5 రోజుల్లో దేశంలోని పలు ప్రాంతంలోనూ ఎండలు తీవ్రస్థాయిలో ఉంటాయి భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఏప్రిల్ 13 నుండి ఏప్రిల్ 19 మధ్య కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే రెండు రోజుల్లో మధ్యప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఉరుములు, బలమైన గాలులు కూడా వీస్తాయని వాతావరణ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య కాలంలో సాధారణ కంటే ఎక్కువ వేడిగా ఉండే రోజులను అంచనా వేసింది.
Also Read:AP Politics: హస్తినలో ఏపీ రాజకీయం.. మొన్న పవన్, నేడు సోము.. ఏం జరుగుతోంది?
రాబోయే ఐదు రోజులపాటు దేశంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్‌లో బీహార్, జార్ఖండ్, తూర్పు మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, పశ్చిమ మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ , హర్యానాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా, మార్చిలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. IMD డేటా ప్రకారం, భారతదేశం మొత్తం మార్చిలో 37.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also Read:Bajireddy Govardhan Reddy : ఈడీ, ఐటీ దాడులు చేయించే ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు సహకరించాలి
మార్చిలో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ, ఏప్రిల్, మే, జూన్‌లలో మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ వేడి గాలులు ఉంటాయని అంచనా వేసింది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఎండల తీవ్ర అధికం అవుతుందని ఐఎండీ చెప్పింది. ఉష్ణోగ్రత సాధారణం కంటే కనీసం 4.5-6.4 సెల్సియస్ పెగుతుందని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.