Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాన మంత్రి షెషబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీలపై విరుచుకుపడ్డారు. ప్రధాని, విదేశాంగమంత్రులు విదేశీ పర్యటనపై ప్రశ్నలు గుప్పించారు. షెహబాజ్ షరీఫ్ ప్రస్తుతం కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం కోసం యూకేలో ఉండగా, విదేశాంగ మంత్రి బిలావల్ గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) యొక్క కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ సమావేశంలో పాల్గొనడానికి గురువారం…
King Cobra: ప్రపంచవ్యాప్తంగా 1,47,517 జంతు జాతులలో 41,459 జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందని వెల్లడించింది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) తన తాజా నివేదికలో పేర్కొంది. అంతరించి పోయే జాతుల జాబితాలో చాలా వరకు మనం పులులు, సింహాలు, చిరుతల గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అయితే ఇందులో ‘కింగ్ కోబ్రా’ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ విషపూరిత సర్పం ఇప్పుడు ప్రమాదం అంచున…
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ముందు టీమిండియాకు గాయాలే కాదు మంచి కూడా జరుగుతుంది. ఇంగ్లాండ్ లోనే ఉన్న టీమిండియా టాపార్డర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా మరో శతకం బాదాడు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా.. సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ సీజన్ లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న పుజారా.. మూడు సెంచరీలతో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్.. 113 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్ ప్రకారం పాకిస్తాన్ 113 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. రెండు, మూడు స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ కూడా 113 పాయింట్లతోనే ఉండటం గమనార్హం.
ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగిపోతుంది.. ఇప్పుడు 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు భారత్ లో ఇంటర్నెట్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతుంది. 2022 డిసెంబర్ నాటికి దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నెలకోసారైనా ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశ జనాభాలో సగానికి పైగా అంటే 75.9 కోట్ల మంది ( 52 శాతం ) ఇంటర్నెట్ వాడడం ఇదే తొలిసారి.
పసిడికి డిమాండ్ తగ్గిపోతోంది.. జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా అంటే ఏకంగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి రావడంతో ఇలా జరిగిందని.. మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది