World Cup 2023: 2023 ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అక్టోబర్-నవంబర్‌లో 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్‌ల మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు పాకిస్థాన్ భారత్‌కు వచ్చే దానిపై క్లారిటీ లేదు. అయితే భారత్ లో పర్యటించేందుకు తమ ప్రభుత్వం నుండి అనుమతి కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. అంతేకాకుండా బోర్డు పాకిస్థాన్ ప్రభుత్వానికి 3 ప్రశ్నలు వేసింది. అయితే ఆ సమాధానాలు వచ్చిన తర్వాతే పాకిస్తాన్ భారతదేశానికి వచ్చేట్లుగా తెలుస్తుంది.
Read Also: Lust Stories 2 Review: లస్ట్ స్టోరీస్ 2 రివ్యూ
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేసింది. భారత్‌కు వెళ్లేందుకు అనుమతి ఉందా అని పాకిస్థాన్ బోర్డు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవేళ ప్రభుత్వం ఆమోదిస్తే పాకిస్థాన్ మ్యాచ్‌లు జరిగే వేదికపై అభ్యంతరం ఉందా అని అడిగింది. భద్రతను పరిశీలించడానికి ప్రభుత్వం ఒక బృందాన్ని భారతదేశానికి పంపుతుందా అని బోర్డు ప్రశ్నలు వేసింది?.
Read Also: Maharashtra: బీజేపీ మార్క్ రాజకీయం.. రెండేళ్లలో ప్రతిపక్ష కూటమి కకావికలం..
మార్గదర్శకత్వం కోసం బోర్డు అధికారికంగా ప్రభుత్వాన్ని సంప్రదించిందని పిసిబి ప్రతినిధి తెలిపారు. ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ప్రభుత్వానికి లేఖ రాశారు. జూన్ 27న రాసిన లేఖలో వేదికపై బోర్డు ప్రభుత్వం నుండి సలహా కూడా కోరింది. మరోవైపు భారత్ లో పాకిస్థాన్ 5 వేదికల్లో ఆడనుంది. అక్టోబర్ 12న పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. అక్టోబర్ 15న హైదరాబాద్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్, అక్టోబర్ 20న అహ్మదాబాద్ వేదికగా పాకిస్థాన్ వర్సెస్ ఆస్ట్రేలియా.., అక్టోబర్ 23న బెంగళూరు వేదికగా.. పాకిస్థాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 27న చెన్నై వేదికగా పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, అక్టోబర్ 31న చెన్నై వేదికగా పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్, నవంబర్ 5న కోల్‌కతా వేదికగా పాకిస్థాన్ vs న్యూజిలాండ్, నవంబర్ 12న బెంగళూరు వేదికగా పాకిస్థాన్ vs ఇంగ్లాండ్ మ్యాచ్ లు ఆడనుంది. పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరితే కోల్‌కతా వేదికగా ఆడనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ జరగనుంది.