Meenakshi Lekhi: స్లోగన్స్ చేయకపోతే వెళ్లిపోండి.. యువతపై కేంద్ర మంత్రి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖికి (Meenakshi Lekhi) కేరళలో చేదు అనుభవం ఎదురైంది. కోజికోడ్‌లో జరిగిన యువజన సదస్సులో ఆమె సహనం కోల్పోయారు. ప్రసంగం ముగింపులో ఆమె.. భారత్ మాతా కీ జై (bharat mata ki jai) అంటూ నివాదం చేశారు. కానీ ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు. దీంతో ఒకింత కోపానికి గురయ్యారు. ఓ మహిళను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరారు. ఇండియా (India) పట్ల గౌరవం లేనివారు యూత్ కాంక్లేవ్‌లో ఉండనవసరం లేదంటూ తెగేసిచెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది.
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారం కేరళలో (Kerala) పర్యటించారు. కోజికోడ్‌లో కొన్ని రైట్-వింగ్ సంస్థలు యువజన సదస్సును నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి.. ‘భారత్ మాతా కీ జై’ నినాదం చేయాలని ఆడియెన్స్‌కు విజ్ఞప్తి చేశారు. కానీ ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో ఆమె పసుపు రంగు చీర ధరించిన ఒక మహిళను నిలదీశారు. ‘భారత్ మాతా కీ జై’ అనడం ఇబ్బందిగా అనిపిస్తే సదస్సు నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ‘భారత్ (మాత) మీ తల్లి కాదా?’ అని ఆమెను సూటిగా ప్రశ్నించారు. మీరు సభ నుంచి వెళ్లిపోవడమే సరైనదని ఆమెకు సూచించారు. దేశాన్ని గర్వంగా చెప్పుకోలేని వారు, ఇండియా గురించి మాట్లాడటానికి వెనుకాడే వాళ్లు యువజన సదస్సులో ఉండాల్సిన అవసరం లేదని సూచించారు.
Also Read
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
- Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి..
కేంద్రమంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:Sharathulu Varthisthayi Teaser: చిరంజీవి, విజయశాంతిల ప్రేమ కథ.. షరతులు వర్తిస్తాయి
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
-
Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
-
Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!