Canada–India: కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల నిఘా సంస్థ కెనేడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంచలన ఆరోపణలు చేసింది. భారత్‌తో ముప్పు పొంచి ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది. గతేడాది విడుదలైన ఈ నివేదిక వివరాలను స్థానిక మీడియా తొలిసారిగా బయటకు వెల్లడించింది. భారత్‌తో పాటు చైనా, రష్యాపై కూడా కెనడా నిఘా సంస్థ ఇలాంటి ఆరోపణలు గుప్పించింది. కెనడా నిఘా నివేదికలో భారతదేశ పేరును నేరుగా ప్రస్తావించడం కూడా ఇదే తొలిసారి కావడంతో ఈ పరిణామాలు తీవ్ర కలకలం రేపుతోంది.
Read Also: Telangana Cabinet Meeting: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. బడ్జెట్ సమావేశాలపై చర్చ..
అయితే, కెనడా రాజకీయాలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో భారత్ జోక్యాన్ని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ఛాన్స్ ఉందని నిఘా వర్గాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ నివేదిక ఆధారంగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లోతైన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, డ్రాగన్ కంట్రీ చైనా జోక్యంపై నిఘా వర్గాలు మరింత ఆందోళన వ్యక్తం చేశాయి. చైనాను అతి పెద్ద విదేశీ ముప్పుగా అభివర్ణించాయి. కెనడా రాజకీయాల్లో చైనా కార్యకలాపాల విస్తృతి, వినియోగిస్తున్న వనరుల దృష్ట్యా కమ్యునిస్టు దేశం తీరు ఆందోళనకరమని నిఘా వర్గాలు అభిప్రాయపడ్డాయి. కెనడాలోని అన్ని రంగాలు, అన్ని స్థాయుల్లో చైనా జోక్యం విపరీతంగా పెరిగిపోయిందని వెల్లడించింది. ఈ నిఘా నివేదికలో భారత్‌తో పాటూ చైనా పేరును నిఘా సంస్థ కెనేడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ నేరుగా ప్రస్తావించింది.