Maldives: గత అధ్యక్షుడు ఓ “విదేశీ రాయబారి” చెప్పినట్లు విన్నాడు: మహ్మద్ ముయిజ్జూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మరోసారి పరోక్షంగా భారత వ్యతిరేకతను బయటపెట్టాడు. అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ, భారత్ వ్యతిరేక విధానాలను ప్రోత్సహిస్తున్నారు. ‘‘ఇండియా ఔట్’’ నినాదంలో అధికారంలోకి వచ్చిన ఇతను, వచ్చీ రాగానే మాల్దీవుల్లోని భారత సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు. మరోవైపు చైనా ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నాడు.
తాజాగా మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్‌పై విమర్శలు గుప్పించారు. సోలిహ్ భారత దేశానికి మంచి మిత్రుడు. అధ్యక్షుడు ముయిజ్జూ మాట్లాడుతూ.. సోలిహ్ తన పదవీ కాలంలో ఓ విదేశీ రాయబారి ఆదేశాల మేరకు పనిచేశారని ఆరోపించారు. దేశ స్వతంత్రతను విదేశాల చేతిలో పెట్టాడంటూ మండిపడ్డాడు. టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్ల కొనుగోలు ఒప్పందంపై ప్రతిపక్షాల నుంచి ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సోలిహ్‌పై వ్యాఖ్యలు చేశాడు.
Also Read
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
- North Korea vs South Korea: సరిహద్దులో ఉద్రిక్తత.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి వార్నింగ్
- Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
Read Also: Amit Shah: అమిత్ షాపై “రౌడీ” వ్యాఖ్యలు.. సీఎం కొడుకుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
2018-23 వరకు అధికారంలో ఉన్న మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీకి పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, దేశ స్వతంత్రను కాపాడటంలో విఫమైందని ఆరోపించారు. దేశాన్ని విదేశీ చేతుల్లో పెట్టాడని ఆరోపించారు. ఆర్థికంతో సహా అన్ని విషయాల్లో స్వాతంత్ర్యాన్ని కోల్పోయామని, ఫలితంగా దేశానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ప్రస్తుతం దేశాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, మేం చేస్తున్న ప్రయత్నాలను వారు అంగీకరించరని ముయిజ్జూ అన్నారు.
గత అధ్యక్షుడు సోలిహ్ ప్రభుత్వం చాలా విషయాల్లో భారత్‌కి మంచి మిత్రుడిగా ఉన్నారు. చైనాను కాదని భారత అనుకూల విధానాలను అనుసరించారు. పాలనాపరంగా భారత్‌పై సోలిహ్ ఆధారపడ్డారని ప్రస్తుతం ముయిజ్జూకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్(పీఎన్సీ) ఆరోపిస్తోంది. తాజాగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం చూస్తుంటే పరోక్షంగా భారత్ గురించి ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నాడని తెలుస్తోంది. భారత్‌ని ఇన్నాళ్లుగా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్న ముయిజ్జూ ఇటీవల మాట్లాడుతూ.. రుణాల నుంచి విముక్తి పొందేందుకు భారత్ తమకు ఎన్నటికి మిత్రదేశమని వ్యాఖ్యానించారు. రుణాల నుంచి విముక్తి కోరుతున్నట్లు తెలిపారు.
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?