Sri Lanka Record: శ్రీలంక టీమ్ అరుదైన ఘనత.. 48 ఏళ్ల భారత్ రికార్డు బ్రేక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka Break 48 Year Old India Massive Test Record: శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు అరుదైన రికార్డు నెలకొల్పింది. ఓ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా.. అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. ఛటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఈ రికార్డు సాధించింది. దాంతో 48 ఏళ్ల క్రితం భారత్ నెలకొల్పిన రికార్డు బద్దలైంది. 1976లో భారత్ ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు చేయగా.. తాజాగా శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు చేసింది.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 531 పరుగులకు ఆలౌటైంది. చివరి ఇద్దరు బ్యాటర్లు మినహా తొమ్మిది మంది రెండంకెల స్కోరు చేశారు. నిషాన్ మదుష్క (57), దిముత్ కరుణరత్నే (86), కుసాల్ మెండిస్ (93), దినేష్ చండిమాల్ (59), ధనంజయ డి సిల్వా (70), కమిందు మెండిస్ (92) అర్ధ శతకాలు సాధించారు. ఏంజెలో మ్యాథ్యూస్ (23), జయసూర్య (28), విశ్వ ఫెర్నాండో (11) రెండంకెల స్కోరు చేశారు.
Also Read
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
కాన్పూర్‌లో 1976లో న్యూజిలాండ్‌పై భారత్ 524/9 స్కోరు చేసి డిక్లేర్డ్ చేసింది. బిషన్ సింగ్ బేడీ భారత జట్టుకు నాయకత్వం వహించగా.. ఆరుగురు భారత ఆటగాళ్లు అర్ద సెంచరీలు చేసారు. ఇప్పటివరకు ఇదే రికార్డు కాగా.. తాజాగా శ్రీలంక ఆ రికార్డు బద్దలు కొట్టింది. 2009లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా 520/7 (డిక్లేర్డ్), 1998లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా 517, 1981లో ఆస్ట్రేలియాపై పాకిస్తాన్ 500/8 (డిక్లేర్డ్) ఒక్క సెంచరీ లేకుండా భారీ స్కోర్లు సాధించాయి.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!