ప్రపంచంలోని 5 దేశాల్లో ఉన్న ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కి చెందిన 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. వారు విదేశాలలో నుంచి ప్లాట్లు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా, హోం మంత్రిత్వ శాఖ NIA విచారణకు ఆదేశించింది. దీంతో వెంటనే ఎన్‌ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఇన్‌పుట్ ఆధారంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, విదేశాల్లో సమావేశమై భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఉగ్రవాదులకు భారత్ నుంచి హవాల ద్వారా డబ్బు చేరుతోందని గుర్తించింది. 5 మంది ఖలిస్థానీలు NIA రాడార్‌లో ఉన్నట్లు తేల్చింది.
READ MORE: ‘ఛలో ఏపీ’ అంటూ.. రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి సిద్దమైన బెంగళూరు ఆంధ్ర ఓటర్లు..
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. యూఏఈలో నివసిస్తున్న బల్జీత్ సింగ్ అలియాస్ బల్జీత్ మౌర్, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న గుర్జంత్ సింగ్, కెనడాలో నివసిస్తున్న ప్రిన్స్ చౌహాన్, అమెరికాలో నివసిస్తున్న అమన్ పూరేవాల్, పాకిస్థాన్‌కు చెందిన బిలాల్ మన్షేర్ ఈ కేసులో ప్రధాన కుట్రదారులు. ఈ ఐదుగురు నిందితులు ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అనే సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు. పంజాబ్‌లోని పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది కమల్‌జీత్ శర్మతో ఈ ఐదుగురు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఉద్దేశంతో జైలులో ఉన్న ఖైదీలను KTF కోసం రిక్రూట్ చేయడానికి కమల్జీత్ శర్మ పనిచేస్తున్నాడు. కమల్‌జీత్‌పై ఇప్పటికే 3 ఇతర ఎన్‌ఐఏ కేసుల్లో ఛార్జిషీట్ దాఖలైంది. వీరంతా కలిసి పంజాబ్‌లో ఖలిస్థానీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం, ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు వసూలు చేయడం వంటివి చేస్తున్నారు.