Sri Lanka: ఇంత సాయం చేసిన లంక బుద్ధి పోనిచ్చుకోలేదు.. భారత్ ఆందోళనలు బేఖాతరు..
- బుద్ధిపోనిచ్చుకోని శ్రీలంక..
- మళ్లీ చైనా పాట..
- చైనా నౌకలపై వచ్చే ఏడాది నుంచి నో బ్యాన్..
- భారత్ ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka: భారత్‌పై నిఘా పెట్టేందుకు చైనా శ్రీలంకను పావుగా వాడుకుంటోంది. ఇప్పటికే శ్రీలంకకు ఇచ్చిన అప్పులకు బదులుగా ఆ దేశం హంబన్‌టోట నౌకాశ్రయాన్ని డ్రాగన్ కంట్రీకి లీజుకు ఇచ్చింది. తరుచుగా చైనాకు చెందిన పరిశోధన నౌకలు శ్రీలంక, మాల్దీవుల్లో లంగరు వేస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి శ్రీలంకకు భారత్ భారీగా సాయం చేసినప్పటికీ, ఈ విషయాన్ని మరిచిపోయి మళ్లీ చైనా పాటనే పాడుతోంది. ప్రస్తుతం పరిశోధన నౌకలపై ఉన్న నిషేధాన్ని వచ్చే ఏడాదిని నుంచి ఎత్తేయాలని శ్రీలంక నిర్ణయించుకున్నట్లు జపాన్ మీడియా నివేదించింది. జపాన్ సందర్శించిన శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ తన వైఖరిని స్పష్టం చేశారు.
Read Also: JIO 5G Data : జియో వినియోగదారులు అపరిమిత 5G డేటా కావాలనుకుంటే ఈ రీఛార్జ్స్ చేయాల్సిందే..
Also Read
హిందూ మహాసముద్రంలో చైనీస్ పరిశోధనా నౌకల కదలికలు పెరగడంతో, అవి గూఢచారి నౌకలు కావచ్చని న్యూఢిల్లీ ఆందోళన వ్యక్తం చేసింది. శ్రీలంక అటువంటి నౌకల్ని అనుమతించొద్దని కోరింది. భారత్ ఆందోళన నేపథ్యంలో జనవరి నెలలో ఇలాంటి నౌకలపై బ్యాన్ విధించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒక చైనా నౌకకు మినహాయింపు ఇచ్చింది. ఆ తర్వాత నిషేధం కొనసాగుతుందని పేర్కొంది.
ఇదిలా ఉంటే, తమ ప్రభుత్వం వివిధ దేశాలకు వేర్వేరు నిబంధనల్ని కలిగి ఉండదని, చైనాను మాత్రమే అడ్డుకోలేనిమ శ్రీలంక మంత్రి సబ్రీ అన్నారు. ఇతర దేశాల వివాదంతో శ్రీలంక ఎవరి పక్షం వహించదని స్పష్టం చేసినట్లు జపాన్ మీడియా శుక్రవారం నివేదించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి వరకు ఉంది. వచ్చే ఏడాది నుంచి శ్రీలంక తమ నౌకాశ్రయాల్లోకి విదేశీ పరిశోధన నౌకల్ని నిషేధించదని సబ్రీ చెప్పారు. నవంబర్ 2023 వరకు రెండు చైనా గూఢచారి నౌకల్ని తమ రేవుల్లో డాక్ చేయడానికి శ్రీలంక అనుమతించింది. యువాన్ వాంగ్ 5, షియాన్ 6 నౌకలు శ్రీలంకు వచ్చాయి.
- Tags
- Chinese ship
- india
- Sri Lanka
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు