త్వరలో సమర్ 2 (SAMAR 2) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పరీక్షించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇది శత్రువులను ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. దీనిని స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈ క్షిపణి పరిధి దాదాపు 30 కిలోమీటర్లు. కాగా.. ఈ క్షిపణి గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మంగళవారం ఈ సమాచారాన్ని అందించారు.
బీసీసీఐ గొప్ప మనసు చాటుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత.. నేపాల్ క్రికెట్ జట్టుకు భారత్‌లో సాయం అందించేందుకు ముందుకొచ్చింది. కాగా.. బీసీసీఐ ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్‌ను భారతదేశంలో తన మ్యాచ్‌లను నిర్వహించడానికి అనుమతించింది. బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రెండు వారాల ప్రాక్టీస్ సెషన్స్ లో పాల్గొనేందుకు నేపాల్ జట్టుకు బీసీసీఐ అనుమతినిచ్చింది.
బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న నిరసనలు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని తొలగించడానికి దారితీసింది. బంగ్లాదేశ్‌లో నిరసనలకు విద్యార్థులే నాయకత్వం వహించినట్లు కనిపించినప్పటికీ.. ముఖ్యంగా మైనారిటీ హిందువులపై హింస ఉగ్రవాద సంస్థలచే నిర్వహించబడిందని నిఘా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కాగా.. ఉగ్రవాద సంస్థల నుండి భారతదేశానికి ముప్పు పెరుగుతోందని నిఘా వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (ఎల్ఈటీ), బంగ్లాదేశ్‌కు చెందిన అన్సరుల్లా బంగ్లా టీమ్ (ఏబీటీ)తో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద దాడులకు పాల్పడినట్లు సమాచారం.
ఆదివారం అర్థరాత్రి భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులోని కరీంగంజ్ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు బంగ్లాదేశీయులను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు. వారిని మోటియుర్ సేఖ్, ముషియార్ ముల్లా, తానియా ముల్లా.. రీటా ముల్లాగా గుర్తించినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ 'X' లో తెలిపారు.
భారతదేశ స్వదేశీ యుద్ధ విమానాల తయారీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. ఈ సిరీస్‌లో 4.5 జనరేషన్ ప్లస్ LCA మార్క్ 2 ఫైటర్ జెట్ మార్చి 2026 నాటికి గాల్లో ఎగురనున్నాయి. అలాగే.. 2029 నాటికి ఈ యుద్ధ విమానాలు పెద్ద ఎత్తున ఉత్పత్తి ప్రారంభం కానున్నాయి. కాగా.. భారతీయ ఐదవ తరం ఫైటర్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ 2035 నాటికి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
BSF Arrested: బంగ్లాదేశ్ లో చెలరేగిన హింసాకాండ తర్వాత తిరుగుబాటు నేపథ్యంలో భారత్ లో ఆందోళనలు పెరిగాయి. వందలాది మంది బంగ్లాదేశ్ పౌరులు భారత సరిహద్దు దగ్గర గుమిగూడి చొరబాటుకు ప్లాన్ చేస్తున్నారు. ఆదివారం కూడా, 11 మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి చొరబాటుకు ప్రయత్నించారు. అయితే, సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది సత్వరమే వారిని పట్టుకొని వారిని అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. Trai…
UPI Payments: మాల్దీవుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వ్యవస్థను అమలు చేయడానికి మాల్దీవులతో భారతదేశం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం చేసింది. ఈ చొరవ వల్ల మాల్దీవుల పర్యాటక పరిశ్రమను గణనీయంగా పెంచుతుందని అంచనా వేస్తున్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మూడు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా శుక్రవారం ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క ఆవిష్కరణ అయిన యూపీఐ సిస్టమ్ మొబైల్ ఫోన్ల…