భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్. సోమనాథ్ గగన్‌యాన్ మిషన్ గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన రాకెట్‌లోని మూడు దశలు శ్రీహరికోటలోని షార్ రేంజ్‌కు చేరుకున్నాయని ఆయన శుక్రవారం తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఏజెన్సీ తన మొదటి టెస్ట్ ఫ్లైట్‌ను ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
మానవతా దృక్పథంతో భారతదేశం సుమారు 1400 కిలోల క్యాన్సర్ నిరోధక మందులను సిరియాకు పంపినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. సిరియా పట్ల దేశం కట్టుబాట్లను దృష్టిలో ఉంచుకుని, డ్రగ్స్ భారతదేశం నుండి పంపబడతాయి.
ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇవ్వడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అనుమతి నిరాకరించింది. దీంతో.. ఐసీసీ ( ICC) కొత్త వేదిక కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో.. యుఏఈలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. బంగ్లాదేశ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగా ఈ టోర్నీని అక్కడ నిర్వహించడం కష్టంగా మారింది.
దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. రాబోయే రోజుల్లో కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, ఏపీలోని రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ప్రసిద్ధ బ్రిటిష్ బైక్ తయారీదారు బీఎస్ఏ (BSA) బైక్స్.. తన ప్రొడక్ట్‌ను 2021లో ప్రపంచవ్యాప్తంగా రీ మోడలింగ్ చేసింది. ఇప్పుడు ఈ బ్రాండ్ భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మార్కెట్లోకి తిరిగి వచ్చింది. బీఎస్ఏ బైక్స్ తన మొదటి ఆఫర్ గోల్డ్ స్టార్ 650ని విడుదల చేసింది. హైలాండ్ గ్రీన్, ఇన్సిగ్నియా రెడ్ కలర్ ఆప్షన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ. 3 లక్షలు
ప్రస్తుతం దేశంలో బిలియనిర్లు ఎవరంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా వంటి పేర్లు తెరపైకి వస్తాయి. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో.. దేశంలో మొదటి సంపన్న బిలియనీర్ (ఫస్ట్ బిలియనీర్ ఇండిపెండెన్స్ ఇండియా) ఎవరో తెలుసా?