Supreme Court: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. అందులో జోక్యం చేసుకోలేం
- ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం..
- ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు ఎగుమతి చేయడాన్ని నిషేధించాలని పిటిషన్..
- విదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని పిల్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించిన అంశంపై దాఖలైన పిటిషన్‌ను ఇవాళ (సోమవారం) సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఇజ్రాయెల్‌కు భారత్ ఆయుధాలు, మిలిటరీ పరికరాల ఎగుమతి చేయడాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశవిదేశాంగ విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొనింది.
Read Also: CM Chandrababu: వరద బాధితులకు చిన్నారుల సాయం.. సీఎం చంద్రబాబు అభినందనలు
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
కాగా, ఈ విధంగా ఆదేశాలిస్తే.. ఆయుధాల ఎగుమతిలో భాగమైన సంస్థలు ఒప్పందాల ఉల్లంఘించాయంటూ దావాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.. అందుకే ఆ సంస్థలను నిలువరించలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొనింది. ఇలాంటి విషయాలు విదేశాంగ విధానంపై ప్రభావం చూపుతాయని తెలిపింది. అయితే, అశోక్ కుమార్ శర్మ, మరికొందరు వ్యక్తుల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేసే భారతీయ సంస్థల లైసెన్సు క్యాన్సిల్ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అందులో చెప్పుకొచ్చారు.
Read Also: Bigg Boss Telugu 8: సీజన్ 1 నుంచే ఆంటీల సెంటిమెంట్.. ఫస్ట్ వీక్ బయటకొచ్చేసిన వారి లిస్ట్ ఇదే!
ఇక, గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ దాడి చేయడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలు పెట్టడంతో.. అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గాజాలో రెండు వర్గాల మధ్య కొనసాగుతున్న ఈ పోరులో 40 వేల మందికిపైగా పాలస్తీనా వాసులు ప్రాణాలు విడిచారని స్థానిక ఆరోగ్య విభాగం వెల్లడించింది. హమాస్ దాడిని ఖండించిన భారత్.. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. అలాగే కాల్పుల విరమణ ఒప్పందం ఆలస్యం కావడంతో.. ఇటీవల ఆరుగురు బందీలు మరణించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చర్చలు సక్సెస్ కావడానికి తగిన ప్రయత్నాలను బెంజిమన్ నెతన్యాహు చేయడం లేదని పరోక్షంగాణ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!