ఈ రోజు (సోమవారం) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో మాల్దీవుల అధినేత ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. వీరి చర్చల ద్వారా రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు బలోపేతం అవుతాయని ఆశిస్తున్నారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దీంతో భారత్ ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా.. ఈరోజు గ్వాలియర్ లో మొదటి టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. ఈ మ్యాచ్ తోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి యువ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ అడుగుపెడుతున్నాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానుల అందరి దృష్టి అతని పైనే ఉంది. మయాంక్తో పాటు ఆల్రౌండర్ నితీష్ కుమార్ బంగ్లాదేశ్తో అరంగేట్రం చేస్తున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా ఉమెన్స్ జట్టు బోణీ కొట్టింది. పాకిస్తాన్ పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 106 పరుగుల లక్ష్యాన్ని 5 బంతులు ఉండగానే చేధించింది. భారత్ బ్యాటింగ్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజులో ఉండి జట్టును విజయం వైపు తీసుకెళ్లింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. భారత్ ముందు 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. దుబాయ్లో ఈ మ్యాచ్ జరుగనుంది.
ఇండియాలో జీప్ కంపాస్ SUV యొక్క ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్ను విడుదల చేసింది. యానివర్సరీ ఎడిషన్ను, సరికొత్త అప్ డేట్స్తో (అక్టోబర్ 3) గురువారం రోజు లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ లో కాస్మెటిక్, యాక్సెసరీ అప్డేట్స్ ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ బ్రాండ్ కు భారత్ లో ఎనిమిదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా యానివర్సరీ ఎడిషన్ ను ప్రకటించారు.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత భారత్కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు.