దేశంలో ఈ-వాహనాలు, ముఖ్యంగా ఈ-స్కూటర్ల పోరు మార్కెట్లో చాలా తీవ్రంగా మారింది. చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. పండుగల సీజన్లో విక్రయాలు పెంచుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు.
భారత్‌లో హైడ్రోజన్‌తో నడిచే రైళ్లు త్వరలో పట్టాలెక్కనుంది. ఈ క్రమంలో.. జర్మనీకి చెందిన TUV-SUD రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది. ఈ రైలు ట్రయల్ రన్ డిసెంబర్ 2024లో ప్రారంభమవుతుందని సమాచారం. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనాలో హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయి.
2022లో ప్రారంభించిన EV6 క్రాస్ఓవర్ తర్వాత కియా ఇండియా.. ఆల్-ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. EV9 ఆల్-ఎలక్ట్రిక్ SUV పూర్తిగా లోడ్ చేయబడిన GT-లైన్ AWD వేరియంట్లో అందిస్తున్నారు. ఈ కారు ధర రూ. 1.3 కోట్లు (ఎక్స్-షోరూమ్).
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఒక న్యాయవాదిని మందలించారు. కోర్టు ఆదేశాలకు సంబంధించిన సమాచారాన్ని కోర్టు మాస్టర్ నుంచి తీసుకున్నట్లు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ చెప్పడంతో న్యాయవాది కోర్టులో అసంతృప్తిని ఎదుర్కోవలసి వచ్చింది.
India: మతస్వేచ్ఛపై అమెరికాకు చెందిన సంస్థ ఇచ్చిన రిపోర్టుపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. యునైటెడ్ స్టేట్స్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం (USCIRF) యొక్క తాజా నివేదికని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది. ఈ నివేదికపై విదేశాంగ మంత్రిత్వ శఆఖ అధికారిక ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. భారతదేశం గురించి వాస్తవాలను తప్పుగా చూపిస్తోందని, ఇది ‘‘ప్రేరేపిత కథనాన్ని’’ ప్రోత్సహిస్తోందని అన్నారు.
ఐసీసీ (ICC) మహిళల టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్లో టీమిండియా రేపు (అక్టోబర్ 4న) న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్ ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లో జరుగనుంది.
అగ్ర రాజ్యం అమెరికాలోని మెక్సికోలో సైన్యం జరిపిన కాల్పుల్లో భారతీయుడి సహా ఆరుగురు వలసదారులు మృతిచెందారు. ట్రక్కులో వెళ్తుండగా కాల్పులు జరపడంతో సంఘటనాస్థలిలో నలుగురు చనిపోగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. వీళ్లంతా భారత్, నేపాల్, పాకిస్థాన్, తదితర దేశాల నుంచి వలసవచ్చినవారిగా తెలుస్తోంది.
Zakir Naik: తీవ్రవాద సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఇస్లామిక్ మత ప్రచారకుడు జకీర్ నాయక్‌కి పాకిస్తాన్ ఘనంగా స్వాగతం పలికింది. ఇండియాకి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న జకీర్ నాయక్ గత కొన్నేళ్లుగా మలేసియాలో ఆశ్రయం పొందుతున్నాడు. జకీర్ పాకిస్తాన్ వెళ్లిన సందర్భంలో ప్రధాని షెహజాబ్ షరీఫ్‌తో పాటు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఇతడి పర్యటన భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.
అదానీ గ్రూప్‌కు సంబంధించి భారీ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్‌తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం క్లీన్ ఎనర్జీకి సంబంధించినదిగా చెబుతున్నారు.