తాను అధికారంలోకి వస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే ప్రతి వస్తువులపై పన్నులు విధిస్తానని ఆయన వెల్లడించారు. ఇక, అమెరికా నుంచి దిగుమతి అవుతోన్న వస్తువులపై చైనా 200 శాతం సుంకం విధిస్తుంది.. బ్రెజిల్లో టారిఫ్‌లు కూడా అలాగే ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
హర్యానాలో ఓటమి తర్వాత కాంగ్రెస్‌లో ఓటమిపై గుబులు మొదలైంది. సీనియర్ నాయకులు పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా పార్టీలోని ఓటమికి అనేక కారణాలలో ఒకటి.
ప్రధాని మోడీ లావోస్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల పర్యటన కోసం గురువారం మోడీ లావోస్ వెళ్లారు. 21వ శతాబ్దం భారతదేశం, ఆసియాన్ దేశాల శతాబ్దంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. లావోస్ వేదికగా 21వ ‘ఆసియాన్- ఇండియా సమ్మిట్’లో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ వేదికగా శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. అందుకోసం.. టీమిండియా ప్లేయర్స్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు.. అక్కడి నుంచి నోవాటెల్, తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు సాధర స్వాగతం పలికారు.
దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా..
ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 82 పరుగుల తేడాతో గెలుపొందింది. 173 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. 19.5 ఓవర్లలో 90 పరుగులకే ఆలౌటైంది.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది. 86 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఢిల్లీలో రెండో టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ముందు 222 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.