ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఈరోజు భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలో.. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. దుబాయ్ వేదికగా కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండో టీ20 జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో.. మొదట భారత్ బ్యాటింగ్ చేయనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
జమిలీ ఎన్నికలకు దేశం మొత్తం మద్దతు తెలిపాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం వల్ల ప్రజలకు, రాష్ట్రాలకు మేలు జరుగుతుందని తెలిపారు. హర్యానాలో మూడోసారి బీజేపీ గెలవడం కేంద్ర సుపరిపాలనకు నిదర్శనం.. ఎన్ని అపోహలు, ప్రచారాలు జరిగినా.. హర్యానా, జమ్మూ కాశ్మీరులో మంచి పరిపాలనపై నమ్మకంతోనే ఎన్డీఏను గెలిపించారన్నారు.
IND vs BAN: ఈరోజు (9 అక్టోబర్ 2024) మూడు మ్యాచ్‌ల T20 అంతర్జాతీయ ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండవ మ్యాచ్ జరుగుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించడం ద్వారా భారత్ ఆధిక్యంలో ఉంది. ఇక సిరీస్ ను చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో భారత్ నేటి మ్యాచ్ లోకి రంగంలోకి దిగనుంది. భారత్, బంగ్లాదేశ్ రెండో టీ20 మ్యాచ్ పరిస్థితి, ఈ మైదానంలో…
Instagram Facing Issues Across India: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఇన్స్టాగ్రామ్’ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా చాలా మంది వినియోగదారులు ఇన్‌స్టా సేవల్లో సమస్యలు ఎదుర్కొన్నారు. ఈరోజు ఉదయం 11:15 గంటల సమయంలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అప్లికేషన్ లాగిన్, సర్వర్ కనెక్షన్‌కు సంబంధించిన సేవలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ప్రకారం… 64 శాతం మంది యూజర్లు యాప్‌లోకి లాగిన్ అవ్వడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. 24 శాతం…
Maldives: ‘‘ ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఇప్పుడు భారతదేశ శరణు కోరేందుకు వచ్చాడు. ఏడాది క్రితం చైనాను చూసుకుని రెచ్చిపోయిన ముయిజ్జూకి, అక్కడి ప్రభుత్వానికి అసలు సమస్య వచ్చే సమయానికి ఇండియా గుర్తుకు వచ్చింది.
ఇండియా ఉమెన్స్ టీమ్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి మహిళల టీ20 ప్రపంచకప్ 2024 పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. అయితే పాకిస్థాన్‌పై విజయం సాధించినా.. టీమిండియాకు సెమీస్ మార్గం అంత సులువు కాదు. టీమిండియా తదుపరి రెండు మ్యాచ్‌లు ఆసియా ఛాంపియన్ శ్రీలంక, డిఫెండింగ్ టీ20 ప్రపంచకప్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరగనున్నాయి. సెమీఫైనల్‌కు చేరాలంటే భారత్‌కు ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవడం ముఖ్యం.