భారత్- బంగ్లాదేశ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ గ్వాలియర్లో జరుగనుంది. MPCA స్టేడియంలో ఎల్లుండి (6 అక్టోబర్ 2024) మ్యాచ్ జరుగనుంది. అందులో భాగంగా ఇరు జట్లు తొలి టీ20 కోసం గ్వాలియర్ చేరుకున్నాయి. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా నెట్ సెషన్లో విపరీతంగా చెమటలు పట్టిస్తుంది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. భారత్ ముందు 161 పరుగుల బిగ్ టార్గెట్ పెట్టింది.
భారత వైమానిక దళం 25% కంటే ఎక్కువ అగ్నివీర్లను పర్మినెంట్ చేయగలదు. అయితే దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం, అగ్నిపథ్ స్కీమ్ కింద ప్రతి బ్యాచ్ అగ్నివీర్లలో గరిష్టంగా 25% మాత్రమే శాశ్వతంగా మారే అవకాశం ఉందని వాయుసేన చీఫ్, ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ అన్నారు.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జరుగనుంది. మొదటిది గ్వాలియర్, రెండో టీ 20 న్యూ ఢిల్లీ, మూడో టీ20 హైదరాబాద్లో జరుగనుంది. చాలా రోజుల తర్వాత.. ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్లో జరుగనున్న టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయం జరుగనుంది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది.
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్ పర్యటనకు వస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఇండియాలో తొలి పర్యటన చేయబోతున్నారు. జూన్లో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత్లో పర్యటించబోతున్నారు.
దాదాపు పదేళ్ల తర్వాత భారత్కు చెందిన విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. గతంలో సుష్మా స్వరాజ్ పాక్ లో పర్యటించారు. ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశం నుంచి ఎవ్వరూ మళ్లీ శత్రుదేశం పాకిస్థాన్ కి వెళ్లలేదు. ఈసారి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్ కూడా పాల్గొంటుంది.
ఆపిల్ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రపంచ దిగ్గజ సంస్థ భారత్లో తన సేవలను విస్తరించేందుకు యోచిస్తోంది. ఇందులో భాగంగా భారతదేశంలో మరో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ యోచిస్తోందని తెలుస్తోంది. బెంగుళూరు, పూణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలో నాలుగు కొత్త రిటైల్ స్టోర్లను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తోంది.