Small Vehicles: భారత్లో ప్రతి ఒక్కరూ తమకు సొంత కారు కలిగి ఉండాలని అనుకుంటున్నారు. ఈ కారణంతోనే సరసమైన ధరల్లో ఉన్న చిన్న కార్లకు ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ఈ డిమాండ్ 2025లో మరింత ఎక్కువగా ఉండబోతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ‘నోమురా’ తన రిపోర్టులో వెల్లడించింది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అమెరికా, జపాన్ కంపెనీస్ చిన్న కార్లను భారీగా తయారు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మార్కెట్లో చిన్న కార్లను లాంచ్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఎస్‌యూవీలు, ప్రీమియం కార్ల ధరలు క్రమంగా పెరగడంతో.. కస్టమర్ల చూపు చిన్న కార్లపై పడింది. సీఎన్‌జీ కార్ల విక్రయాలు కూడా పెరిగిపోతున్నాయి.
Read Also: Egg Prices: పెరిగిన కోడిగుడ్డు ధరలు.. తెలుగు రాష్ట్రాల్లోనే టాప్!
ఇక, చిన్న ఎలక్ట్రిక్ కార్ల యొక్క డిమాండ్ కూడా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నోమురా చెప్పుకొచ్చింది. ప్రారంభంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ లభించలేదు.. కానీ, ఇప్పుడు ఎక్కువ మంది ఈ కార్లను కొనుగోలు చేస్తున్నారు. కోవిడ్-19 సమయంలో గ్లోబల్ మార్కెట్లో వాహనాల ఉత్పత్తి భారీగా పడిపోయింది. ఆ తర్వాత ఆటోమొబైల్ కంపెనీలు కోలుకున్నాయి.. డిమాండుకు తగ్గ సరఫరా చేయడంలో ఫెయిల్ అయ్యాయి. ప్రస్తుతం కార్ల ఉత్పత్తి పెరిగింది. వచ్చే ఏడాది డిమాండుకు తగిన విధంగా డెలివరీ చేసే అవకాశం ఉందని నమూర్ సర్వేలో వెల్లడైంది.
Read Also: Elon Musk: ఎలాన్ మస్క్‌తో ఇజ్రాయెల్ అధ్యక్షుడి చర్చలు.. ఎందుకంటే?
అయితే, గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్‌పై.. యూఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఐరోపాలో ఉద్యోగ నష్టాలు, ఫ్రాన్స్ & జర్మనీలలో రాజకీయ అనిశ్చితి లాంటివి ఐరోపాలో మొత్తం డిమాండ్ రికవరీని ప్రభావితం చేస్తుందని నోమురా నివేదికలో తేలింది. యూఎస్ ట్యాక్స్, అధిక ధరలు వంటివి కూడా కార్ల అమ్మకాల మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయని సమాచారం.