Smartphone Effects: ప్రస్తుత కాలంలో మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరగడంతో మనుశుల మధ్య వ్యక్తిగత సంబంధాలను దెబ్బ తీస్తోంది. ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ వల్ల పచ్చటి సంసారాల్లో చిచ్చు పెడుతుంది. తల్లిదండ్రులు, భార్యభర్తలు, పిల్లలతో ఉండే సంబంధాలు పూర్తిగా నాశనం అవుతున్నాయని వివో నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. తల్లిదండ్రులు సగటున రోజుకి.. 5 గంటల కంటే ఎక్కువ సమయం.. పిల్లలు 4 గంటలకంటే ఎక్కువ టైం ఈ స్మార్ట్‌ఫోన్‌లలో గడుపుతున్నారని వెల్లడైంది. వీరందరూ ఎక్కువగా సోషల్ మీడియాలో నిమగ్నమైనట్లు తెలిసింది.
కాగా, స్మార్ట్‌ఫోన్ వాడకం వ్యక్తిగత సంబంధాలను బాగా దెబ్బ తీస్తుంది. 66 శాతం మంది తల్లిదండ్రులలో.. 56 శాతం మంది పిల్లలలో ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల వారి వ్యక్తిగత సంబంధాలలో ప్రతికూల మార్పులు వస్తున్నాయని వివో సర్వేలో వెల్లడైంది. ఈ మార్పులే వారి మధ్య సంఘర్షణకు దారి తీస్తున్నాయి. మరోవైపు, 73 శాతం మంది పేరెంట్స్.. 69 శాతం మంది పిల్లలు తమ మధ్య గొడవలకు అధికంగా స్మార్ట్‌ఫోన్ ను వినియోగించడమే కారణమని సర్వేలో తేలింది.
Read Also: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సందిగ్ధతకు తెర.. టీమిండియాకు షాక్!
అయితే, తల్లిదండ్రులు, పిల్లల జీవితాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ భాగంగా మారిపోయింది. దీని వల్ల 76 శాతం మంది పేరెంట్స్, 71 శాతం మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌లు లేకుండా జీవించలేరని ఒప్పుకుంటున్నారని సర్వేలో తేలింది. కాగా, స్మార్ట్‌ఫోన్‌లకు బానిసలుగా 64 శాతం మంది పిల్లలు మారిపోగా.. వారు ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలో గడుపుతున్నారని తెలిపింది. హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, పూణేలలోనే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయాలను వివో ప్రకటించింది.