ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో సందిగ్థత వీడడం లేదు. ఓవైపు ఆతిథ్యం విషయంలో పాకిస్థాన్ మొండిగా ఉండగా.. మరోవైపు పాక్‌కు వెళ్లి ఆడేందుకు భారత్ సిద్ధంగా లేదు. టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తేనే పాల్గొంటామని ఐసీసీకి బీసీసీఐ తేల్చి చెప్పగా.. భారత్ ఆడే మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని పీసీబీని అంతర్జాతీయ క్రికెట్ మండలి కోరింది. ఈ ప్రతిపాదనకు పీసీబీ ఒప్పుకోవడం లేదు. సోమవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో ఆధునీకీకరణ పనులను పరిశీలించిన పీసీబీ ఛైర్మన్ మొహసీన్ నఖ్వీ…
హైదరాబాద్‌లో మెగా టోర్నమెంట్ ప్రారంభమైంది. ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్‌కు ఆతిధ్యమిచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా-మలేషియా జట్ల మధ్య ఫిఫా ఫ్రెండ్లీ ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది. రసవత్తరంగ సాగిన ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఘన విజయం సాధించారు. మరోసారి అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్ర రాజ్యం రిపబ్లికన్ పార్టీ వశం కాబోతుంది. తాజా ఫలితాల్లో ట్రంప్ మ్యాజిక్ ఫిగర్ దాటుకుని భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
Election Campaign: నేటితో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నెల 20వ తేదీన ఒకే విడతలో మహారాష్ట్రలోని 288 స్థానాలకు.. జార్ఖండ్ లో సెకండ్ విడత పోలింగ్ జరగనుంది.
Womens Asian Champions Trophy: బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ 3-0తో జపాన్ను ఓడించి లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది. భారత్ 5 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో అత్యధికంగా 15 పాయింట్లతో ఒలింపిక్ రజత పతక విజేత చైనా (12) కంటే ముందుంది. మంగళవారం జరిగే సెమీస్‌లో భారత్ నాలుగో ర్యాంకర్ జపాన్‌తో తలపడుతుంది. అలాగే చివరి నాలుగో రెండో మ్యాచ్‌లో…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి సంబంధించి కీలక అప్డేట్స్ వస్తున్నాయి. జనవరిలో భారత్‌కు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుందని ఐసీసీ ప్రకటించింది. ఈ ట్రోఫీకి హోస్టింగ్‌తో సంబంధం లేదు.. పెద్ద టోర్నమెంట్లకు ముందు ఐసీసీ ఈ ట్రోఫీ పర్యటనను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ నుంచి భారత్‌కు రానుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.
Hypersonic missile: భారతదేశం తొలిసారి దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణిని సక్సెస్‌ఫుల్‌గా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.