మహీంద్రా కొన్ని రోజుల క్రితం భారతదేశంలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అవే.. ఎక్స్ఈవీ 9ఈ, బీఈ 6ఈ. విశేషమేమిటంటే కంపెనీ.. ఈ రెండింటికి సంబంధించిన బేస్ వేరియంట్ల ధరలను మాత్రమే వెల్లడించింది. మిగతా వేరియంట్ల ధరలు వెల్లడించలేదు. ఈ నెలలో కంపెనీ ఈ రెండు ఎస్‌యూవీల మొత్తం లైనప్ ధరలను వెల్లడిస్తుందని భావిస్తున్నారు.
కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం ప్రత్యేక భేటీ.. ఏం చేద్దాం..? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.. పలు కీలక అంశాలపై చర్చించారు.. కొన్ని నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది కేబినెట్.. అయితే, సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు.. పాలనా అంశాలు కొద్దిసేపు ముచ్చటించారు.. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైన చర్చించారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు…
India Pakistan: గత కొంత కాలంలో పాకిస్తాన్లో పలువురు ఉగ్రవాదులు ‘‘గుర్తుతెలియన వ్యక్తుల’’ చేతిలో మరణించారు. బైక్‌పై వచ్చేవారు ఉగ్రవాదుల్ని దగ్గర నుంచి కాల్చి చంపారు. ఇదే తరహాలో పాకిస్తాన్ వ్యాప్తంగా పలువురు ఉగ్రవాదుల హత్యలు జరిగాయి. అయితే, ఈ చనిపోయిన ఉగ్రవాదులకు భారత్‌లో ఏదో విధంగా సంబంధం ఉండటం గమనార్హం.
Bangladesh: పాకిస్తాన్ సైన్యం అరాచకాల నుంచి రక్షించి బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన భారత్ ఇప్పుడు, ఆ దేశానికి శత్రువుగా మారింది. అనేక అరాచకాలు చేసిన పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్‌కి స్నేహితుడయ్యాడు. ఎప్పుడైతే షేక్ హసీనా పదవీ నుంచి దించేసి, మహ్మద్ యూనస్ అధికారం చేపట్టాడో అప్పటి నుంచి బంగ్లా వ్యాప్తంగా భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. హిందువులపై అరాచకాలు చేస్తూ, మరో పాకిస్తాన్‌గా మారేందుకు బంగ్లాదేశ్ సిద్ధమవుతోంది.
26/11 ముంబై ఉగ్ర దాడుల్లో ప్రమేయం ఉన్న పాకిస్థానీ సంతతికి చెందిన కెనడా వ్యాపారవేత్త తహవ్వూర్ రాణాను త్వరలో భారత్‌కు అప్పగించవచ్చు. రాణాను భారత్‌కు తీసుకొచ్చే ప్రక్రియ దౌత్య మార్గాల్లో సాగుతోంది. 2024 ఆగస్ట్‌లో.. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందం ప్రకారం.. రాణాను భారత్‌కు అప్పగించవచ్చని యూఎస్ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఈ అంశంపై చర్చలు కొనసాగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లోనే భారత్‌కు తీసుకొచ్చి.. ఉరిశిక్ష…
Terrorist Activities: భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినందుకు గాను బంగ్లాదేశ్ జాతీయుడికి బెంగళూరులోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు సోమవారం నాడు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.