కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణిష్ చావ్లా నియమితులయ్యారు. చావ్లా ప్రస్తుతం రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలో ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపటి నుంచి (డిసెంబర్ 26) భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో బాక్సింగ్ డే టెస్ట్ జరుగనుంది. ఈ సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ టెస్ట్ మ్యాచ్ రెండు టీమ్‌లకు చాలా ముఖ్యమైనది. అయితే.. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను టాస్ సమయానికి ప్రకటించనుంది. బాక్సింగ్ డే…
JSW తన వాహనాలను MG మోటార్ ఇండియా సెలెక్ట్ ద్వారా లగ్జరీ విభాగంలోకి తీసుకురాబోతోంది. కంపెనీ MG సైబర్‌స్టర్‌ను త్వరలో ప్రారంభించనుంది. సైబర్‌స్టర్ 2-డోర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు వివరాలు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ముందుకు రానున్నాయి.
S Jaishankar: నేటి నుంచి ఆరు రోజుల పాటు అమెరికాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత భారత్ నుంచి అమెరికాకు వెళ్లడం ఇదే మొదటిసారి.