టీమిండియా-సౌతాఫ్రికా జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. అయితే ఇప్పటికి మూడు మ్యాచ్‌లు టీమిండియా-సౌతాఫ్రికాల మధ్య జరుగగా.. అందులో మొదటి రెండు మ్యాచ్‌లు సౌతాఫ్రికా కైవవం చేసుకుంది. అయితే మూడో మ్యాచ్ టీమిండియా ఖాతాలో పడగా.. నేడు నాలుగో మ్యాచ్ రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన సఫారీలు బౌలింగ్ ఎంచుకోవడంతో.. టీమిండియాకు బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు…
దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ మార్క్రమ్ భారత్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన అతడు మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆడడని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చెప్పింది. పాజిటివ్‌గా తేలిన తర్వాత మార్క్రమ్ ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. అతడు తిరిగి జట్టుతో చేరి సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయంతో బాధపడుతున్న డికాక్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని క్రికెట్…
విశాఖపట్నంలో డా. వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోన్న విషయం తెలిసిందే! తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో, బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఓపెనర్లైతే భారత్‌కి శుభారంభాన్ని అందించారు. రుతురాజ్ గైక్వాడ్ (35 బంతుల్లో 57 పరుగులు), ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 54 పరుగులు)లు ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించారు.…
భారత పర్యటనను దక్షిణాఫ్రికా జట్టు తెగ ఆస్వాదిస్తోంది. ఏ మాత్రం పసలేని భారత బౌలింగ్ ను సునాయాసంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు టీ20ల్లో విజయ దుందుభి మోగించింది. తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది…
తొలి టీ20లో భారత్ 200పైన స్కోరు చేస్తే దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఊది పారేశారు. రెండో టీ20లో మనోళ్లు 150 కూడా చేయలేదు.. అంతేకాదు ఆరంభంలోనే 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలో నెట్టారు.. గెలుపుపై ఆశలు రేపారు. కానీ ఆఖరికి ఫలితంలో ఎలాంటి మార్పు లేదు. మళ్లీ గెలిచింది దక్షిణాఫ్రికానే. ఒత్తిడిలోనూ ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు భారత్‌కు వరుసగా రెండో ఓటమి రుచి చూపించారు. టీమిండియాకు వరుసగా రెండో ఓటమి ఎదురైన నేపథ్యంలో కెప్టెన్ రిషభ్…
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే! భారీ స్కోరు (211) చేసినప్పటికీ.. బౌలర్ల పేలవ ప్రదర్శన కారణంగా బోల్తా కొట్టేసింది. దీంతో, ఈరోజు జరగనున్న రెండో టీ20లో ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. అందుకు బౌలింగ్ విభాగంలో భారత్ పుంజుకోవాల్సి ఉంటుంది. బ్యాటింగ్ విషయంలో భారత్‌కి ఎలాంటి ఢోకా లేదు. ఆరో వికెట్ దాకా దూకుడుగా రాణించే బ్యాట్స్మన్లే ఉన్నారు.…
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. టీమ్ఇండియాపై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. తొలి టీ20 మ్యాచ్ లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏ మాత్రం ఒత్తిడి లేకుండా సునాయాసంగా గెలిచేసింది. దక్షిణాఫ్రికా విజయంలో ప్రధానంగా మిల్లర్, రస్సీ వాండర్ డుసెన్…
ఫేలవ ఫామ్, గాయం కారణంగా కొంతకాలం భారత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఐపీఎల్ అదరగొట్టి, తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ప్రయత్నంలోనే తన జట్టుకి ఐపీఎల్ అందించిన హార్దిక్.. ఆల్‌రౌండర్‌గానూ మంచి ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 487 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు. ఇంత మంచి పెర్ఫార్మెన్స్ కనబర్చినందుకే స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కి హార్దిక్ ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే…
త్వరలో సౌతాఫ్రికాతో జరగపున్న సిరీస్ నుంచి విరాట్ కోహ్లీని తొలగించనున్నారా? అంటే దాదాపు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి కోహ్లీ ఫామ్‌లో లేడన్న విషయం అందరికీ తెలుసు. అతడు సెంచరీ చేసి రెండేళ్ళ పైనే అవుతోంది. అప్పుడప్పుడు కొన్ని పర్వాలేదనిపించే ఇన్నింగ్స్ ఆడాడు కానీ, వింటేజ్ కోహ్లీని తలపించే భారీ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అయితే ఘోరంగా విఫలమయ్యాడు. మూడుసార్లు గోల్డెన్ డక్ అవ్వడమే కాదు, ఏ…
భారత్‌తో జరుగుతున్న నామమాత్రపు చివరి వన్డేలో దక్షిణాఫ్రికా దూకుడుగా ఆడుతోంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ శతకంతో అదరగొట్టాడు. 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జట్టు భారాన్ని తన భుజాలపై వేసుకున్న డికాక్.. సంయమనంతో ఆడుతూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్.. అదే ఊపుతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో…