Shoaib Akhtar: ఆసియా కప్‌లో హైవోల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగబోతుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఈరోజు రాత్రికి తలపడబోతున్నాయి. పహల్గాం ఉగ్రదాడితర్వాత జరుగుతున్న తొలి పోరు కావడంతో.. వరల్డ్ వైడ్ గా ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ లో ఎప్పుడూ భారతే హాట్ ఫేవరెట్ గా నిలుస్తుంది. మరోవైపు ఈ మ్యాచ్ పై పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.
Read Also: Euphoria : గుణశేఖర్ యూత్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘యుఫోరియా’ అప్ డేట్ ..
అయితే, సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలోని భారత జట్టుపై షోయబ్ అక్తర్ ప్రశంసలు గుప్పించాడు. టీ20ల్లో ఈ జట్టు అద్భుతంగా ఆడుతుందన్నారు. అలాగే, ఈ జట్టుతో అప్రమత్తంగా ఉండాలని పాక్ కూ సూచించాడు. వారు మీపై ఆధిపత్యం చెలాయిస్తారని క్లియర్ గా తెలుస్తోంది.. ఇక, ఫైనల్‌లో పాక్ తో కాదు.. అఫ్గానిస్థాన్‌తో ఆడడానికి వారు ఇష్టపడతారనిఓ ఛానల్‌లో చర్చ సందర్భంగా అక్తర్ ఈ కామెంట్స్ చేశాడు.
Read Also: MAHARASHTRA: బాబోయ్ కుక్కలు.. ఒకే రోజులో 67 మందిని…
ఇక, భారత జట్టులో విరాట్ కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడైన ప్లేయర్ లేడని, ఆ జట్టును ఓడించడానికి ఇది పాకిస్థాన్‌కు మంచి ఛాన్స్ అని ఈ షోలో పాల్గొన్న మరో పాక్ మాజీ సారథి మిస్బా ఉల్ హక్ తెలిపారు. ఈ సందర్భంగా షోయబ్ అక్తర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. టీమిండియా బ్యాటింగ్ భిన్నంగా ఉంది.. కొత్త ప్లేయర్స్ మన బౌలర్లను ఇప్పటి వరకు ఎదుర్కోలేదన్నాడు. పాక్ బౌలర్లు టాప్ ఆర్డర్‌ను కూల్చితే, విజయానికి ఇది మంచి అవకాశం ఉంటుందని మిస్బా ఉల్ హక్ తెలిపాడు.
కానీ, టీమిండియా మిడిలార్డర్ చాలా స్ట్రాంగ్ గా ఉందని మాజీ కెప్టెన్ మిస్బా వ్యాఖ్యలకు అక్తర్ కౌంటర్ ఇచ్చాడు. భారత జట్టులో రింకు సింగ్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జితేశ్ శర్శతో పాటు అక్షర్ పటేల్ కూడా బ్యాటింగ్ చేయగలడు అని తెలియజేశాడు. 2 వికెట్లు పడితే కుప్పకూలే జట్టు కాదు.. అయినా, ఇది విరాట్ కాలం నాటి జట్టు అసలే కాదన్నాడు. భారత జట్టుపై గెలుపొందటం అంత ఈజీ కాదన్నారు. మరో విషయం ఆ జట్టులో అభిషేక్ శర్మ కూడా ఉన్నది మర్చిపోవద్దని పాక్ జట్టుకు గట్టి కౌంటర్ ఇచ్చాడు అక్తర్.