India vs England: లీడ్స్ లోని హెడింగ్లీ మైదానం వేదికగా మొదలైన భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్ లో ఇరు జట్ల ఆటగాళ్లు నల్ల బ్యాండ్స్ ధరించారు. దీనికి కారణం, గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంగిభావంగా ఇలా చేసారు. ఈ ఘటనలో మొత్తం 241 మంది మరణించగా, కేవలం ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి కూడా ఉన్నారు.
Read Also: India vs England: సాయి సుదర్శన్ అరంగ్రేటం.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్..!
ఈ విషాద ఘటనకు గాను మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక నిమిషం మౌనం కూడా పాటించారు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ, అహ్మదాబాద్‌లో జరిగిన దుర్ఘటనలో మరణించిన వారి స్మృతికి నల్ల బ్యాండ్స్ ధరించామని, బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని ట్వీట్ చేసింది. ఇక నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. హెడింగ్లీ ఒక మంచి క్రికెట్ వికెట్. మొదటి సెషన్‌ను ఉపయోగించుకోవాలన్న ఆలోచనతో బౌలింగ్ ఎంచుకున్నాం అని స్టోక్స్ చెప్పారు.
Read Also: Droupadi Murmu: బర్త్‌డే రోజు వేదికపైనే కంటతడి పెట్టిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. వీడియో వైరల్..
ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ అరంగ్రేటం చేయనున్నాడు. అతను ఇండియా టెస్ట్ క్యాప్ నెంబర్ 317గా అరంగేట్రం చేశాడు. భారత మాజీ బ్యాట్స్‌మన్ చేతేశ్వర్ పుజారా చేతుల మీదుగా అతనికి టెస్ట్ క్యాప్ అందించారు. అలాగే కరుణ్ నాయర్ ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన సంగతి విశేషం. ఇక భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. మేము టాస్ గెలిచుంటే మేమూ బౌలింగ్‌నే ఎంచుకునేవాళ్లం. మొదటి సెషన్ కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. కానీ, తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. బెకెన్ హమ్ లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరిగాయి. ప్రిపరేషన్ అద్భుతంగా జరిగింది. సాయి సుదర్శన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు అని తెలిపాడు.