WTC 2025-27: సౌతాఫ్రికా 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) టైటిల్ గెలిచిన వెంటనే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025-27 సైకిల్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం తొమ్మిది జట్లు కలిసి మొత్తం 71 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. 2025 జూన్ 17న శ్రీలంకలోని గాలే వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. ఇక ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు ఆడే జట్లలో ఆస్ట్రేలియా (22 టెస్టులు), ఇంగ్లాండ్ (21 టెస్టులు) ముందు వరుసలో ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ రెండు జట్ల మధ్య ఆస్ట్రేలియా వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాసిస్ సిరీస్ జరగనుంది.
Read Also: Star Heroine: సీన్ కోసం 15 మంది పురుషుల ముందు నగ్నంగా నిలబడ్డాను..
ఇకపోతే భారత జట్టు తన క్యాంపెయిన్‌ను జూన్ 20న ఇంగ్లాండ్‌తో లీడ్స్ వేదికగా మొదలుపెట్టనుంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా మొత్తం 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో ఎక్కువ భాగం హోమ్ మ్యాచ్‌లే కావడం విశేషం. ఇందులో టీమిండియా షెడ్యూల్ చూస్తే.. ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు, వెస్టిండీస్‌తో 2 టెస్టులు, దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టులు, శ్రీలంకతో 2 టెస్టులు, న్యూజిలాండ్‌తో 2 టెస్టులు జరగున్నాయి.
Read Also: Star Heroine: సీన్ కోసం 15 మంది పురుషుల ముందు నగ్నంగా నిలబడ్డాను..
గత సైకిల్‌లో టీమిండియా మూడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి ఎక్కువ మ్యాచ్‌లు ఇండియా సొంతగడ్డపై ఉండటంతో విజయం సాధించే అవకాశం అధికంగా ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం లేకపోలేదు. ప్రస్తుత ఛాంపియన్ సౌతాఫ్రికా, అక్టోబరులో పాకిస్తాన్‌లో టెస్ట్ సిరీస్‌తో తన మొదటి గేమ్ ను ప్రారంభిస్తుంది. అయితే 2026 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం వారి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ఆస్ట్రేలియా (22 టెస్టులు), ఇంగ్లాండ్ (21 టెస్టులు) అత్యధిక మ్యాచ్‌లు ఆడతాయి. ఆ తర్వాత టీమిండియా 18 టెస్ట్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్ 16 టెస్టులు, వెస్టిండీస్ 14 టెస్టులు, దక్షిణాఫ్రికా 14 టెస్టులు, పాకిస్తాన్ 13 టెస్టులు, శ్రీలంక 12 టెస్టులు, బంగ్లాదేశ్ 12 టెస్టులు ఆడనున్నాయి.