భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు మూడో టీ20 మ్యాచ్ జరుగబోతోంది. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకాబోతోంది. రాజ్ కోట్ వేదికగా ఇరు జట్లు తలపడబోతున్నాయి. సిరీస్ రేసులో ఉండాలంటే ఇంగ్లీష్ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ సిరీస్ లో టీమిండియా ఇప్పటికే రెండు మ్యాచ్ లను గెలిచి ఇంగ్లాండ్ కు సవాల్ విసురుతోంది. మూడో టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని…
Tilak Varma: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ యువ ఆటగాడు తిలక్ వర్మ తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్లో ఒక కొత్త రికార్డు సృష్టించాడు. తిలక్ ఇటీవల తన ఆటతీరుతో భారత అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు. గత నాలుగు టీ20 ఇన్నింగ్స్‌లలో తిలక్ ఒక్కసారైనా ఔట్ కాకుండా మొత్తం 318 పరుగులు సాధించాడు. ఇది ఒక బాట్స్మెన్ రెండు ఔట్స్ మధ్యలో చేసిన అత్యధిక పరుగులుగా ప్రపంచ రికార్డుగా నిలిచింది. దక్షిణాఫ్రికా…
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను టీమ్ ఇండియా అద్భుత విజయంతో ప్రారంభించింది. ఇక కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయంతో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక నేడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని కొనసాగించాలని టీమిండియా చూస్తుండగా.. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో విజయం నమోదు చేయాలని ఇంగ్లండ్ భావిస్తోంది. Also Read: Noman Ali: వయసనేది జస్ట్…
IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. కోల్‌కతా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు రెండో మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమ్ ఇండియా, రెండో మ్యాచ్‌లో కూడా గెలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేయాలని చూస్తుండగా.. మరోవైపు ఈ…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో తమ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను జట్టు నుంచి ఊహించలేదని చెప్పాడు. త్వరగా వికెట్లను కోల్పోవడం తమ ఓటమిని శాశించిందని, ఈడెన్ గార్డెన్స్ పిచ్ పొరపాటేమీ లేదని బట్లర్ పేర్కొన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జోస్ బట్లర్ వంటి డేంజరస్ బ్యాటర్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదని స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి పేర్కొన్నాడు. కేవలం స్పిన్‌తోనే ఇంగ్లీష్ బ్యాటర్లను ఆపలేమని, బౌన్స్‌తో బంతిని వేసి కట్టడి చేశామన్నాడు. తన బౌలింగ్‌కు 10కి 7 రేటింగ్ ఇచ్చుకుంటా అని, తాను ఇంకా మెరుగవ్వాల్సి ఉందని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన…
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇంగ్లండ్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/23), అక్షర్ పటేల్ (2/22) దెబ్బకు నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు.…
బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 132 పరుగులు లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలోనే ఛేదించింది. భారత్ యువ బ్యాటర్ అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. 34 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 79 రన్స్ చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్.. బిన్నంగా సంబరాలను చేసుకున్నాడు. బొటనవేలు, చూపుడు…
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియామకం అయినప్పటి నుంచి భారత జట్టుకు పెద్దగా కలిసి రావడం లేదు. కీలక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత్ ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా సిరీస్ అనంతరం ఆటగాళ్లపై గౌతీ సిరీస్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్, గంభీర్‌కు మధ్య స్వల్ప విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరుగుతోంది. అందులకే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 సమయంలో మోర్కల్ జట్టుతో…
Champions Trophy 2025: 2025 ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 12న గడువు తేది నిర్ణయించింది. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జట్టును ప్రకటించేందుకు మరింత ఆలస్యం కావచ్చు. తాజా సమాచారం ప్రకారం, బీసీసీఐ తన జట్టును సకాలంలో ప్రకటించడానికి ఐసీసీని మరికొంత సమయం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, ఐసీసీ సూచనలకు అనుగుణంగా, టీమ్ ఇండియా చీఫ్ సెలెక్టర్…