ఛట్టోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
బంగ్లాదేశ్‌తో రేపు జరిగే మూడో వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్‌ను చివరి వన్డే కోసం భారత జట్టులో చేర్చింది.