India vs Bangladesh 1st Test Match Day 1 Summary: ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్, టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి రోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. ఛటేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) అర్థశతకాలతోనూ, రిషభ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ (46)తో రాణించడంతో.. టీమిండియా స్కోర్ బోర్డు ముందుకు కదిలింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (22), శుభ్మన్ గిల్ (20) సహా విరాట్ కోహ్లీ (1) పేలవ ప్రదర్శనలతో వెంటనే పెవిలియన్ చేరడంతో.. భారత్ కష్టాల్లో పడిపోయింది. అప్పుడు రిషభ్ పంత్ కాసేపు పరుగుల వర్షం కురిపించాడు. 45 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సహాయంతో 46 పరుగులు చేశాడు. అయితే.. అర్థశతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉండగా, మెహదీ హసన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో 112 పరుగులకే భారత్ 4 వికెట్లు కోల్పోయింది.
Rishabh Pant: చరిత్ర సృష్టించిన పంత్.. ఆ రికార్డ్ సాధించిన తొలి క్రికెటర్
ఇలాంటి సమయంలో పుజారా, శ్రేయస్ అయ్యార్ ఆచితూచి ఆడుతూ.. భారత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. మరో వికెట్ పడకుండా, బంగ్లా బౌలర్లను ఎదుర్కొంటూ.. మంచి భాగస్వామ్యాన్ని జోడించారు. ఐదో వికెట్‌కి వీళ్లిద్దరు కలిసి 149 పరుగుల పార్ట్నర్‌షిప్ అందించారు. అయితే.. వీరి జోడీని తైజుల్ ఇస్లామ్ బ్రేక్ చేశాడు. 90 వ్యక్తిగత పరుగుల వద్ద పుజారా అతని బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ ఉన్నారు. ఇక బంగ్లా బౌలర్ల విషయానికొస్తే.. తైజుల్ ఇస్లాం మూడు వికెట్లు తీయగా.. మెహదీ హసన్ రెండు, ఖాలీద్ అహ్మద్ ఒక వికెట్ పడగొట్టారు.