Rishabh Pant: చరిత్ర సృష్టించిన పంత్.. ఆ రికార్డ్ సాధించిన తొలి క్రికెటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rishabh Pant Creates Sensational Record In Tests: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచిన పంత్.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో మాత్రం మంచి ప్రదర్శన కనబరిచాడు. కేవలం 40 బంతుల్లోనే 46 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో పంత్ రెండు భారీ సిక్స్‌లు బాదడంతో.. టెస్టుల్లో మొత్తం 50 సిక్స్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో.. టెస్టుల్లో ఈ ఫీట్ అత్యంత వేగంగా అందుకున్న తొలి క్రికెటర్‌గా పంత్ చరిత్రపుటలకెక్కాడు. అంతేకాదు.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో వికెట్ కీపర్‌గానూ పంత్ నిలిచాడు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
ఇప్పటి వరకు 128 మ్యాచ్‌లు ఆడిన పంత్.. 4021 పరుగులు సాధించాడు. వీటిలో అతడు వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ.. 3651 రన్స్ (109 మ్యాచ్‌లు) నమోదు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు 15 అర్థశతకాలున్నాయి. అగ్రస్థానంలో మాత్రం భారీ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నాడు. తన కెరీర్‌లో మొత్తం 535 మ్యాచ్‌లు ఆడిన ధోని.. ఓవరాల్‌గా 17092 పరుగులు సాధించాడు. వీటిలో 15 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా.. బంగ్లాతో జరుగుతున్న టెస్ట్‌లో.. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచే పంత్ చెలరేగడాన్ని చూసి, ఈ మ్యాచ్‌లో అతడు భారీ పరుగులు సాధిస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. 31.4 ఓవర్ వద్ద అర్ధ శతకానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న పంత్‌ను మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.
India-China Clash Video: తరిమి తరిమికొట్టిన భారత జవాన్లు.. వీడియో వైరల్
మరోవైపు.. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (22), శుభ్మన్ గిల్ (20), విరాట్ కోహ్లీ (1) పేలవ ప్రదర్శనతో నిరాశపరిచారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్.. కాసేపు మెరుపులు మెరిపించి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం పుజారా, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు. వీళ్లు ఆల్రెడీ అర్థశతకాలు చేసేసి, భారత్‌ని ఆదుకున్నాడు. టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరుని జోడించడంలో నిమగ్నమయ్యారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!