Shafali Verma: మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరగనున్న సెమీఫైనల్ పోరుకు ముందు భారత జట్టు శిక్షణ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. చివరి నిమిషంలో జట్టులోకి వచ్చిన యువ సంచలనం షఫాలీ వర్మ తాజాగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన శిక్షణా సెషన్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఓపెనర్ ప్రతీక రావల్ కాలు, మోకాలి గాయాల కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో సోమవారం నాడు షఫాలీని జట్టులోకి తీసుకున్నారు.
కేవలం 5.99mm మందం, 50MP+50MP+50MP కెమెరాలు, పవర్‌ఫుల్ స్పెక్స్‌తో వచ్చేస్తున్న Motorola Edge 70..!
ఇక ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాతో భారత్ గురువారం యూనివర్సిటీ గ్రౌండ్‌లో రెండవ సెమీఫైనల్‌లో తలపడనుంది. 21 ఏళ్ల షఫాలీ తన శిక్షణను కొన్ని హై క్యాచ్‌లు పట్టే ప్రాక్టీస్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత ప్యాడ్లు కట్టుకుని, భారత టాప్ ఆర్డర్‌తో కలిసి బ్యాటింగ్ చేసింది. షఫాలీ తన ట్రేడ్‌మార్క్ అయిన పవర్ హిట్స్‌ను గ్రౌండ్‌పై, గాల్లోకి కూడా సంధించడానికి వెనుకాడలేదు. అయితే, కొన్ని స్వీప్ షాట్‌లు మాత్రం ఆమె అనుకున్నంత బాగా ఆడలేకపోయింది. షఫాలీ గంటకు పైగా బ్యాటింగ్ చేసింది.
తన బ్యాటింగ్ సెషన్ కొనసాగించడానికి షఫాలీ.. దీప్తి శర్మ, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్, రాధా యాదవ్ వంటి నలుగురు ప్రధాన బౌలర్లను నెట్స్‌లో ఎదుర్కొంది. బ్యాటింగ్ ముగిసిన తర్వాత ఆమె కాసేపు బౌలింగ్ ప్రాక్టీస్ కూడా చేసింది. నెట్ సెషన్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం వైస్ కెప్టెన్, మంచి ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన. మంధాన తన సెషన్‌ను అద్భుతంగా కొనసాగిస్తూ, మెరుగైన డ్రైవ్‌లు, సులభంగా బౌండరీ లైన్‌ను దాటించిన భారీ షాట్‌లను కొట్టింది.
Samsung Galaxy S25 Ultra: సామ్ సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రాపై రూ. 28 వేల డిస్కౌంట్.. ఇదిగో డీల్
ఇక నెం. 3 బ్యాటర్ హర్లీన్ డియోల్ కూడా నెట్స్‌లో దూకుడుగా కనిపించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ నెట్ బౌలర్లను ఎదుర్కొంటూ తమ సమయాన్ని గడిపారు. అత్యంత సానుకూల అంశం ఏమిటంటే.. వికెట్ కీపర్-బ్యాటర్ రిచా ఘోష్ ఫిట్‌నెస్ గురించి ఉన్న ఆందోళనలు తొలగిపోయాయి. ఆమె మొదట స్పిన్, ఆపై ఫాస్ట్ బౌలర్లకు కీపింగ్ డ్రిల్స్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగింది. ఆమె ఎటువంటి అసౌకర్యం లేకుండా బ్యాటింగ్ చేయడం కనిపించింది. గత లీగ్ మ్యాచ్‌లో ఫిట్‌నెస్ సమస్యల కారణంగా రిచాకు విశ్రాంతి ఇచ్చారు.