AUS vs IND: నేడే ఆస్ట్రేలియా, భారత్ మొదటి టీ20.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్ డీటెయిల్స్ ఇవే!
- నేడే ఆస్ట్రేలియా, భారత్ మొదటి టీ20
- గెలవడానికి టీమిండియాకు మెరుగైన అవకాశాలు
- కాన్‌బెర్రా పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్.. ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సిరీస్‌కు సిద్ధమైంది. 5 టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు కాన్‌బెర్రాలో మొదటి మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. వన్డే సిరీస్ కోల్పోయినా.. ఇటీవలే ఆసియా కప్ 2025 గెలిచిన ఊపులో ఉండడం, జట్టు పటిష్టంగా కనిపిస్తుండడంతో సిరీస్ గెలవడానికి టీమిండియాకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆస్ట్రేలియా కూడా బలంగా ఉండడంతో హోరాహోరీగా మ్యాచ్ సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆసియా కప్‌లో అభిషేక్ శర్మ మంచి ప్రదర్శన చేశాడు. దాంతో ఆసీస్ గడ్డపై అభిషేక్ ఎలా ఆడుతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పేస్‌కు సహకరించే కాన్‌బెర్రా పిచ్‌పై జోష్ హేజిల్‌వుడ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్‌ను ఎలా ఎదుర్కొంటాడన్నది ఇప్పుడు ఆసక్తికరం. టెస్టుల్లో అదరగొడుతున్నప్పటికీ.. వన్డే, టీ20ల్లో నిరాశపరుస్తున్న శుభ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో రాణించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. తిలక్ వర్మ మీద భారీ అంచనాలున్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కలవరపెడుతోంది. సంజు శాంసన్, శివమ్ దూబె, అక్షర్ పటేల్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా జట్టులో ఉండడం కలిసొచ్చే అంశం. అర్ష్‌దీప్ సింగ్ కొత్త బంతిని పంచుకోనున్నాడు. హర్షిత్ రాణా మూడో పేసర్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది. అక్షర్‌కు తోడుగా వరుణ్, కుల్‌దీప్‌లలో ఒకరు తుది జట్టులో ఉంటారు.
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వన్డేల కంటే టీ20ల్లో ఆస్ట్రేలియా బలంగా ఉంది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టాయినిస్, జోష్ ఇంగ్లిస్ లాంటి స్టార్స్ ఉన్నారు. హెడ్ టీ20ల్లో చెలరేగుతాడని జట్టు ఆశిస్తోంది. మార్ష్ ఫామ్ మీదున్నాడు. మాథ్యూ షార్ట్, మిచెల్ ఒవెన్‌లు సత్తాచాటనున్నారు. హేజిల్‌వుడ్‌కు తోడు బార్ట్‌లెట్, డ్వార్షుయిస్, ఎలిస్‌లతో పేస్ విభాగం బలంగా ఉంది. ఆడమ్ జంపా లేకున్నా కునెమన్ నుంచి టీమిండియాకు ప్రమాదం పొంచి ఉంది.
కాన్‌బెర్రాలో పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలం. ఇక్కడ పేసర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు పెను సవాలే. బౌండరీలు కూడా పెద్దవి కావడంతో రన్స్ అంత ఈజీగా రావు. కాన్‌బెర్రాలో భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశాలు తక్కువ. 160-170 స్కోరు చేస్తే విజయం సాధించే అవకాశాలు మెండు. ఈరోజు వర్షం పడే అవకాశాలు ఉన్నా.. మ్యాచ్‌కు పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు.
Also Read: Cyclone Montha Update: బలహీనపడిన తీవ్ర తుఫాన్ మొంథా.. రానున్న 6 గంటల్లో..!
తుది జట్లు (అంచనా):
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ (కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి/కుల్‌దీప్.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, మిచెల్ ఒవెన్, స్టాయినిస్, టిమ్ డేవిడ్, డ్వార్షుయిస్/ఎలిస్, బార్ట్‌లెట్, హేజిల్‌వుడ్, కునెమన్.
తాజావార్తలు
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
-
Sonali Kulkarni: ‘ది ప్యారడైజ్’ ఈవెంట్లో స్టేజీపైనే ఎమోషనల్ అయిన నాని ‘ఆన్-స్క్రీన్ మదర్’!
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!