USA: “భారతీయుల వల్లే ఉద్యోగాలు కోల్పోతున్నాం”.. యూఎస్ ఇన్‌ఫ్లూయెన్సర్ల బలుపు మాటలు..
- భారతీయులపై అమెరికన్ ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వేషం..
- ఇండియన్స్ వల్లే మా ఉద్యోగాలు పోతున్నాయని కామెంట్స్..
- రెచ్చిపోతున్న ట్రంప్ మద్దతుదారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించడంతో, రెండు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మరోవైపు, భారత్, రష్యాకు మరింత దగ్గర అవ్వడంతో పాటు చైనాతో సంబంధాలు మెరుగుపడటం, అమెరికన్ రాజకీయవేత్తల్ని కలవరపరుస్తోంది. ఇదిలా ఉంటే, ట్రంప్ మద్దతుదారులైన, రైట్-వింగ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు బలుపు మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా భారతీయ వర్కర్లు, విద్యార్థులను టార్గెట్ చేశారు. అంతటితో ఆగకుండా ‘‘కాల్ సెంటర్’’ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘‘భారత్‌లో అమెరికా ఎలాంటి ట్రేడ్ డీల్ చేసినా, వారికి మరిన్ని వీసాలు ఇవ్వాల్సి ఉంటుంది. మాకు ట్రేడ్ డెఫిషిట్, వీసాల రూపంలో వారికి చెల్లించాల్సిన అవసరం లేదు. మోడీ చైనాతో ఎలాంటి ఒప్పందం చేసుకోగలడో చూద్దాం’’అని ప్రముఖ కామెంటేటర్ లారా ఇంగ్రహమ్ తన ఎక్స్ పోస్టులో కామెంట్ చేశారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
ట్రంప్ మద్దతుదారు చార్లీ కిర్క్ కూడా ఇదే విధంగా విద్వేష వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతీయుల వల్లే అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అమెరికాకు ఇక ఉద్యోగుల అవసరం లేదు. మన దేశ ప్రజలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు.
Read Also: China Tomb Raiding Case: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. సమాధులను తవ్వి కటకటాల పాలయ్యాడు..
ప్రముఖ రైట్ వింగ్ కామెంటేటర్ జాక్ పోసోబియెక్ మరింత విషం వెళ్లగక్కాడు. ‘‘కాల్స్ సెంటర్స్‌పై 100 శాతం టారిఫ్స్ వేయాలి. విదేవీ రిమోట్ ఉద్యోగాలపై అదే విధంగా సుంకాలు వేయాలి’’ అని అన్నారు.
అయితే, వీరి వ్యాఖ్యలు, విద్వేషంపై భారతీయ అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి భారతీయ అమెరికన్లు ట్రంప్, రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే తాము మద్దతు ఇచ్చి తప్పు చేశామనే భావనను వ్యక్తం చేశారు. పత్రికా రచయిత బిల్లీ బినియన్ మాట్లాడుతూ.. ‘‘ఇది అసూయ. భారతీయులు బాగా చదువుకుని, కష్టపడి ముందుకెళ్తే, కొంతమంది ఎదుగుదలగా కాకుండా పోటీగా చూస్తు్న్నారు’’ అని అన్నారు. అమెరికాలో టెక్ ఉద్యోగాల్లో భారతీయులకు ప్రాధాన్యం దక్కుతోంది. హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయులు 75శాతం మంది ఉన్నారు. అమెరికాలో 2 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు.
తాజావార్తలు
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!