India – America: భారత్-అమెరికా మధ్య దోస్తి.. 10 ఏళ్లకు కుదిరిన రక్షణ ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India – America: భారతదేశం – అమెరికా మధ్య 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదిరింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన తర్వాత అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ ఈ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకోనున్నాయి. అలాగే ఇరు దేశాలు సాంకేతిక సహాయం కూడా అందించుకోనున్నాయి.
READ ALSO: 2025 బిలియనీర్ల ర్యాంకింగ్స్ – ఎవరి విలువ ఎంత ఉందో చూడండి!
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
పీట్ హెగ్సేత్ ఏమన్నారంటే..
రక్షణ ఒప్పందంపై పీట్ హెగ్సేత్ మాట్లాడుతూ.. “ఈ రకమైన ఒప్పందం ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదు. మేము 10 సంవత్సరాల పాటు రక్షణ ఒప్పందంపై సంతకం చేసాము. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సమన్వయాన్ని సృష్టించే ప్రయత్నం. ప్రాంతీయ స్థిరత్వాన్ని కొనసాగించడం, సైనిక సమన్వయాన్ని మరింతగా పెంచడం, రక్షణ సాంకేతిక సహకారాన్ని పెంపొందించడం ఈ ఒప్పందం ప్రాథమిక లక్ష్యం” అని అన్నారు.
అమెరికా – భారతదేశం మధ్య కుదిరిన ఈ రక్షణ ఒప్పందం ఇండో-పసిఫిక్ పై ప్రత్యక్ష ప్రభావాలను చూపుతుంది. ఈ ఒప్పందం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సైనిక సహకారం, ఉమ్మడి చొరవల కోసం దశాబ్ద కాలం పాటు సాగే రోడ్ మ్యాప్‌ను నిర్దేశిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా రక్షణ ఒప్పందం తర్వాత, రాజ్‌నాథ్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు. ఈ ఒప్పందాన్ని కొత్త శకానికి నాందిగా ఆయన అభివర్ణించారు. “ఈ రక్షణ ఒప్పంద రోడ్‌మ్యాప్ భారతదేశం-అమెరికా రక్షణ సంబంధాలకు దిశానిర్దేశం చేస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. “ఇది ఇరుదేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక కలయికకు సంకేతం” అని అన్నారు.
ఇండో – పసిఫిక్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినది, అలాగే ఆర్థికంగా చురుకైన ప్రాంతాలలో ఒకటిగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం నాలుగు ఖండాలను కలిగి ఉంది. ఆ ప్రాంతాలు.. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా. ప్రపంచ జనాభాలో దాదాపు 60 శాతం మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. భారతదేశం, చైనా, యునైటెడ్ స్టేట్స్ వంటి శక్తివంతమైన దేశాలు కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఒకప్పుడు అమెరికా ఆధిపత్యం ఉండేది, కానీ చైనా దానిని తగ్గించింది. దీంతో ఇప్పుడు ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం బలపడుతుందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు భయపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Indonesia New Capital: దేశ రాజధానిని మారుస్తున్న అతిపెద్ద ముస్లిం దేశం.. ఏ భయంతోనో తెలుసా!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!