Ajit Doval: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకే, పాకిస్తాన్‌లోని మొత్తం 09 ఉగ్రస్థావరాలపై 24 దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాదులు పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఈ దాడుల గురించి జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ ప్రపంచదేశాలకు వివరించారు. భారతదేశానికి ఉద్రిక్తతల్ని పెంచే ఉద్దేశ్యం లేదని, ఒక వేళ పాకిస్తాన్ దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా…
Operation Sindoor: పహల్గామ్ దాడిలో 26 మంది అమాయకుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు బలిగొన్నారు. అప్పటి నుంచి యావత్ దేశం పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా కోరుకుంటోంది. ప్రధాని నరేంద్రమోడీ కూడా ఉగ్రవాదులు, వారికి మద్దతుదారులు ఎక్కడా ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు.
Scalp, Hammer: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సింధూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకేతో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాల్లోకి దూరి ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 80 మంది వరకు ఉగ్రవాదులను హతం చేసింది. ముఖ్యంగా, బలహల్పూర్‌లోని జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో భారత్ వాడిని ఆయుధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్కాల్ప్…
Operation Sindoor: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేపట్టిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ వ్యాప్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ త్రివిధ దళాల నేతృత్వంలో ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో దాడులు జరిగాయి.
Ind-Pak Tensions To Impact IPL: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్- పాకిస్తామ్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భారత్ లో జరుగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది.
80 Terrorists Killed: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో భారత్ తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు నిర్వహించిన వరుస దాడుల్లో సుమారు 80 మందికి పైగా టెర్రరిస్టులు మరణించారని భద్రతా దళాలు తెలిపాయి.
Operation Sindoor: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్‌పై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. 9 ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతంగా చేపట్టినట్లు ఇండియన్ సైన్యం ప్రకటించింది.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ స్పందించారు. ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.. భారతదేశం ఈ ప్రతీకార చర్యల్లో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది అన్నారు. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లోని ఏ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకోలేదు అన్నారు.
సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంట పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో.. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులు మృతి చెందారు.