India Pakistan Tension: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. 100కు పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. దీని తర్వాత, పాకిస్తాన్ భారత్‌పై డ్రోన్ దాడికి తెగబడింది. అయితే, భారత సైన్యం ఈ దాడిని భగ్నం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
Pak Drone Attack: పాకిస్తాన్ తన కుట్రలను కొనసాగిస్తూనే ఉంది. పాక్ పౌర విమానాలను రక్షణగా ఉంచుకుని భారత్‌పై డ్రోన్ దాడులకు తెగబడుతోంది. వరసగా రెండో రోజు కూడా పాకిస్తాన్ భారత నగరాలే లక్ష్యంగా డ్రోన్ దాడులు చేసింది. అంతర్జాతీయ సరిహద్దు (IB),నియంత్రణ రేఖ (LOC)లను దాటి దాడి చేసేందుకు పాక్ ప్రయత్నించింది. ఈ ప్రయత్నాలనున భారత సైన్యం భగ్నం చేసింది.
Donald Trump: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ భారత్‌పై వరసగా రెండో రోజు డ్రోన్ దాడులు చేసింది. సరిహద్దుల్లోని 20 నగరాలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, వీటన్నింటిన భారత గగనతల రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. తాజాగా, ఉద్రిక్తతలపై ట్రంప్ స్పందించినట్లు వైట్ హౌజ్ ప్రకటించింది. త్వరగా సమస్య ముగియాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. Read Also: Pak drone attacks: 20 నగరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ తాజా డ్రోన్ దాడులు.. భారత్,…
Pak drone attacks: వరసగా రెండో రోజు దాయాది పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్ చేశాయి. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థ వీటిని గుర్తించి, సమర్థవంతంగా అడ్డుకున్నాయి. ముఖ్యంగా 26 నగరాలను లక్ష్యంగా చేసుకుని తాజా డ్రోన్ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
India Pakistan War: పాకిస్తాన్ తన తీరు మార్చుకోవడం లేదు. భారత్ చేతిలో చావు దెబ్బలు తింటున్నా.. యుద్ధానికే సిద్ధపడుతోంది. వరసగా రెండో రోజు కూడా డ్రోన్లతో భారత భూభాగాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది. జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు యత్నించింది. ఈ దాడులను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ తిప్పికొట్టింది.
IND vs PAK: పాకిస్తాన్ మళ్ళీ సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడటంతో, భారత్ గట్టిగా బుద్ధి చెబుతోంది. పాక్ కాల్పులకు ఇండియన్ ఆర్మీ ధీటుగా జవాబు ఇస్తుంది. ఈ నేపథ్యంలో భారత్- పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
India Pakistan War: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ సంచలన ఆదేశాలను జారీ చేసింది. భారతదేశ సహాయక సైనిక దళం అయిన టెరిటోరియల్ ఆర్మీని యాక్టివేట్ చేస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. మొత్తం 32 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్లలో 14 బెటాలియన్లను యాక్టివ్ చేసింది.
India Pakistan:భారత్ చేతిలో భంగపడుతున్నప్పటికీ, పాకిస్తాన్ మాత్రం తన ప్రజల్ని ఫేక్ ప్రచారంతో నమ్మించే ప్రయత్నం చేస్తోంది. ప్రతికూల విషయాలను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ పాక్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. పాకిస్తాన్ సోషల్ మీడియా హ్యాండిల్స్, పాక్ మీడియా కలిసి పాక్ ప్రజల్ని బకరాలను చేస్తున్నాయి.
India Pakistan War: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత భూభాగాలపై పాకిస్తాన్ గురువారం సాయంత్రం క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. వీటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. దీని తర్వాత పాకిస్తాన్‌లో భారత త్రివిధ దళాల దీపావళి మొదలైంది.
Pakistan: ‘‘ఆపరేషన్ సింధూర్’’ దెబ్బ పాకిస్తాన్‌కి బాగా తగినట్లు ఉంది. అయితే, ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంలో మాత్రం భారత్ దాడి వల్ల నష్టపోయామని ఒప్పుకోవడం లేదు. పాకిస్తాన్ జరిపిన దాడిలో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, తన ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.