Pakistan: ఆపరేషన్ సిందూర్ నష్టాలను కప్పిపుచ్చుకునేందుకు పాకిస్తాన్ నానా తంటాలు పడుతోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌తో సమాధానం చెప్పింది. ముందుగా, పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేసింది. అ
S Jaishankar: పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తే భారత్ దానిని లక్ష్యంగా చేసుకుంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. యూరప్ పర్యటనలో ఉన్న ఆయన ఫ్రాన్స్ పొలిటికోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ని టార్గెట్ చేస్తూ హెచ్చరించారు. ‘‘వారు ఎక్కడ ఉన్నారో మాకు పట్టింపు లేదు. వారు పాకిస్తాన్లో ఉంటే, మేము పాకిస్తాన్లోకి వెళ్తాము’’ అని అన్నారు.
Fact-check: ఆపరేషన్ సిందూర్‌లో భారత దాడిని తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ ఇంకా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. 11వైమానిక స్థావరాలు , కీలక ఆయుధ వ్యవస్థలు నాశనమైనప్పటికీ తామే విజయం సాధించామంటూ ప్రగల్భాలకు పోతోంది. భారత్ చేతితో చావు దెబ్బ తిన్నప్పటికీ, విక్టరీ ర్యాలీల పేరుతో పాకిస్తాన్‌లోని ప్రముఖులు, ఆర్మీ సంతోష పడుతోంది. అక్కడి ప్రజల్ని బకరాలను చేయడానికి ఇదంతా చేస్తోంది.
India-Pakistan: సింధూ జలాల ఒప్పందం నిలిపివేయడంతో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ భారత్‌కు ఇప్పటి వరకు 4 లేఖలను రాసింది. ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా.. మిగతా 3 లేఖలను ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసిందని పలు జాతీయ మీడియాలో కథనాలను ప్రచురిస్తున్నాయి.
BJP MP: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. పాకిస్తాన్‌లోని ప్రతీ ప్రాంతంలో ఆ దేశ ఆర్మీకి వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతోందని ఆయన ఆదివారం అన్నారు. భారతదేశం పట్ల పాకిస్తాన్‌కి భయం ఉందని, భారత్ తమను మళ్లీ విభజిస్తుందనే భయం వారిలో ఉందని అన్నారు. పాకిస్తాన్ ప్రస్తుతం అప్పుల భారంతో నిండిపోయిందని, ప్రజలు ఆకలితో బాధపడుతుందని ఆయన అన్నారు.
PM Modi: పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు భారతదేశ ‘‘నారీ శక్తి’’ని తక్కువగా అంచనా వేసి తమ వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మహిళల ముందే భర్తల్ని ఉగ్రవాదులు చంపారు. ఈ సంఘటనలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాదంపై భారతదేశ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ అతిపెద్ద విజయవంతమైన చర్యగా ప్రధాని ప్రకటించారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ భారత సైనిక పరాక్రమానికి నిదర్శనమని అమెరికా సైనిక నిపుణుడు జాన్ స్పెన్సర్ కొనియాడారు. భారత్ ఈ ఆపరేషన్‌లో పూర్తి ఆధిక్యత ప్రదర్శించి, విజయం సాధించిందని చెప్పారు. మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్లోని అర్బన్ వార్ఫేర్ స్టడీస్ చైర్ అండ్ అర్బన్ వార్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ స్పెన్సర్ భారత విజయం గురించి ఓ వ్యాసాన్ని పోస్ట్ చేశారు. “ఆపరేషన్ సిందూర్: ఆధునిక యుద్ధంలో నిర్ణయాత్మక విజయం” అనే శీర్షికతో ఎక్స్‌లో కీలక…
Rajnath Singh: 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రస్తావిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘1971లో మన భారత నేవీ పాకిస్తాన్ రెండుగా విభజించింది, ఆపరేషన్ సిందూర్‌లో నావికాదళం తన పూర్తి బలాన్ని ప్రదర్శించి ఉంటే, పాకిస్తాన్ ఇప్పటికే రెండు కాదు, నాలుగు భాగాలుగా విడిపోయేది’’ అని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఆపరేషన్ సిందూర్ కేవలం వార్మ్-అప్ మాత్రమే అని పాకిస్తాన్‌ని హెచ్చరించారు. పాక్ ఏదైనా మళ్లీ దుశ్చర్యకు
PM Modi: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత దళాలు నిమిషాల్లోనే పాకిస్తాన్ లోని వైమానిక స్థావరాలను నాశనం చేశామని ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. ఇది న్యూ ఇండియా అని, భారత్ తన బలాన్ని ప్రదర్శించిందని ప్రధాని శుక్రవారం బీహార్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ అన్నారు. ఉగ్రవాద దాడి మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని గతంలో తాను హామీ ఇచ్చానని, ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలను ధ్వంసం చేసి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నానని చెప్పారు.
India China: ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాకిస్తాన్‌కి చెందిన చైనీస్ ఆయుధాలను, పరికరాలను తుక్కు తుక్కు చేసింది. ముఖ్యంగా చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని దెబ్బకొట్టింది. ఇదే కాకుండా చైనా పాకిస్తాన్‌కి అందించిన PL-15E క్షిపణిని భారత్ కుప్పకూల్చింది. భారత్ ఇటీవల పాకిస్తాన్ ప్రయోగించిన చైనా ఆయుధాల పనితీరుపై వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలపై తొలిసారిగా చైనా ఆర్మీ స్పందించింది. భారత్ చేస్తున్న వ్యాఖ్యల్ని తిరస్కరించింది.