పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మునీర్ ప్రతిరోజూ భారత్ పై విషం కక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చేతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా, షాబాజ్ షరీఫ్ మునీర్‌ను పదోన్నతి కల్పించి ఫీల్డ్ మార్షల్‌గా చేశాడు. కానీ దేవుడు తనను రక్షకుడిగా చేశాడని, తనకు ఏ పదవి అవసరం లేదని అసిమ్ మునీర్ చెబుతున్నాడు. Also Read:BCCI New Rule: బీసీసీఐ సరికొత్త రూల్.. ఆ…
Indo-Pak Clash: పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలకు కాశ్మీర్ ప్రధాన కారణమని నోరు పారేసుకున్నారు.
రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేసిన వాదనలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బహిరంగంగా ఖండించాలని తాజాగా పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. ఈ అంశంపై మోడీ సమాధానమిచ్చారు. ఆపరేషన్ సిందూర్ ఆపమని ప్రపంచలోని ఏ నాయకుడు మమ్మల్ని అడగలేదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. "మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రయత్నించారు.
Pakistan: భారత దేశానికి ఏ మాత్రం తీసుపోము, చెప్పాలంటే భారత్ కన్నా మేమే గొప్ప అని ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ తీరు నవ్వులపాలవుతూనే ఉంది. తాజాగా, పాకిస్తాన్ పరీక్షించిన ఒక క్షిపణి కూలిపోయింది. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన షాషీన్-3 మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని పాకిస్తాన్ పరీక్షించింది.
Parliament Session: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది.
Pakistan: పాకిస్తాన్‌కు ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలను బయటపెట్టుకోవడంలో ఆ దేశం ఎప్పుడూ సిగ్గుపడటం లేదు. తాజాగా, పహల్గామ్ ఉగ్రవాడికి బాధ్యత వహించిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’కు మద్దతు తెలుపుతోంది. ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో నాన్-పర్మినెంట్ సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూనే, ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ప్రస్తావనను నిరోధించింది.
Pakistan: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏం మాట్లాడినా సంచలనంగా మారుతోంది. ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ దాడి సమయంలో ఆయన స్వయంగా పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిందని ఒప్పుకున్నారు. ఆ తర్వాత పాక్ నేషనల్ అసెంబ్లీలో భారత దాడుల గురించి తప్పుడు ప్రకటనలు చేస్తూ దొరికిపోయారు.
Pakistan: పుల్వామా ఘటనకు బదులుగా భారత్ 2019లో ‘‘బాలాకోట్ వైమానిక దాడులు’’ నిర్వహించింది. ఆ సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) పైలట్ అభినందన్ వర్థమాన్ తన మిగ్ -21 బైసన్ విమానంతో అత్యాధునిక అమెరికన్ తయారీ, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్‌కి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చాడు. అయితే, ఆ సమయంలో అభినందన్ ఫైటర్ జెట్ కూడా కుప్పకూలింది. అయితే, పారాశ్యూట్ సాయంతో ఆయన పాకిస్తాన్ భూభాగంలో దిగడంతో పాక్ ఆర్మీకి చిక్కారు.
Ajit Doval: బీజింగ్ వేదికగా జరిగిన సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమైన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భద్రతా అంశాలపై పలు కీలక వ్యాఖ్యలను చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని రకాల ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కొనాల్సిన అవసరాన్ని ఉందని ఆయన స్పష్టం చేశారు. మే 7న భారత్ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడుల తర్వాత ఈ సమావేశం కీలకంగా మారింది. పహల్గామ్…
Donald Trump: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్-పాకిస్తాన్ వివాదాన్ని తానే ఆపినట్లు చెప్పాడు. భారత్-పాకిస్తాన్ సైన్యాల మధ్య ప్రత్యక్ష చర్చల తర్వాతే సైనిక చర్య నిలిపేశామని, ఇందులో మూడో పక్షం ప్రమేయం లేదని ప్రధాని మోడీ, ట్రంప్‌కి తేగేసి చెప్పి కొన్ని గంటలకు అవ్వకముందే మరోసారి ట్రంప్ ‘‘నేనే యుద్ధం ఆపాను’’ అంటూ ప్రకటించుకున్నారు.