India Oil Exports: గ్లోబల్ ఆయిల్ మార్కెట్ లో ప్రస్తుతం ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్, రష్యా ఆయిల్ తో వ్యాపారం చేస్తోంది. రష్యాపై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు ప్రస్తుతం ఆయిల్ కోసం భారత్ ను ఆశ్రయిస్తున్నాయి. యుద్ధాన్ని చూపిస్తూ యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును నిలిపేశాయి. దీంతో పాటు రష్యా క్రూడ్ ఆయిల్ ధరపై ధర పరిమితిని విధించాయి.