Maldives: ‘‘ ఇండియా అవుట్’’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ ఇప్పుడు భారతదేశ శరణు కోరేందుకు వచ్చాడు. ఏడాది క్రితం చైనాను చూసుకుని రెచ్చిపోయిన ముయిజ్జూకి, అక్కడి ప్రభుత్వానికి అసలు సమస్య వచ్చే సమయానికి ఇండియా గుర్తుకు వచ్చింది.
Mohamed Muizzu: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారతదేశానికి వచ్చారు. భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక చర్చల కోసం ఆదివారం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ముయిజ్జూ భార్య, మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మహ్మద్ కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ పర్యటనలో ముయిజ్జూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశమవుతారు.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ హాజరుకానున్నట్లు సమాచారం. ఈ మేరకు భారత్ ఆహ్వానాన్ని ముయిజ్జూ స్వీకరించినట్లు అక్కడి మీడియా తెలిపింది.